Begin typing your search above and press return to search.

కంటెంట్ తో కోట్లు కొల్లగొడుతున్న లేడీ యూట్యూబర్..!

By:  Tupaki Desk   |   29 Nov 2022 11:30 AM GMT
కంటెంట్ తో కోట్లు కొల్లగొడుతున్న లేడీ యూట్యూబర్..!
X
సోషల్ మీడియా యుగంలో కంటెంట్ ఉన్నోడిదే రాజ్యం. ఎవరైతే వినూత్నమైన కంటెంట్ ను ఇస్తారో వాళ్లు కోట్లు కొల్లగొట్టవచ్చు అనడానికి ఫర్ ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా అమెరికాకు చెందిన లిన్సీ డొనొవాన్ నిలుస్తోంది. 18 ఏళ్ళకే యూట్యూబ్ వీడియోలు చేయడం ప్రారంభించిన లిన్సీ ఐదేళ్ళ కాలంలోనే తన సంపాదనతో ఏడు లగ్జరీ హౌస్ లకు ఓనర్ గా మారిపోయింది.
 
అతి చిన్న వయస్సులో తన కంటెంట్ తో కోట్లు సంపాదిస్తున్న లిన్సీ డొనొవాస్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె అసలు కథేంటి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ఆసక్తిని చూపిస్తున్నారు. లిన్సీ డొనొవాస్ కేవలం యూట్యూబ్ గానే కాకుండా మోడల్ గా.. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ గా అతి తక్కువ సమయంలోనే విజయవంతమైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని మేరీలాండ్ కు చెందిన లిన్సీ తన 17యేట నుంచే వీడియోలు చేయడంపై ఆసక్తిని పెంచుకుంది. తన కంటెంట్ పై నమ్మకంతో 18 ఏళ్ళ వయస్సు నుంచి యూట్యూబ్ వీడియోలను ప్రారంభించింది. వీటి నుంచి వచ్చే మనీనీ చాలా జాగ్రత్తగా ఖర్చు పెడుతూ మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది.

తన కంటెంట్ పై నమ్మకంతో చాలా హార్ట్ వర్క్ చేసింది. సబ్ స్కైబర్స్ నుంచి వస్తున్న ప్రోత్సాహంతో యూట్యూబ్ మరింత ఫోకస్ పెట్టింది. అలాగే మోడలింగ్‌లో చేసిన ప్రతీ అసైన్‌మెంట్‌కీ రూ.50 వేల చొప్పున ఛార్జ్ చేసింది. ఈ డబ్బును కూడా దాచుకోవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఈ డబ్బును తిరిగి రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసింది.

ఈ రంగాన్ని సైతం అతి త్వరగానే వంటబట్టించుకొని రియల్ ఎస్టేట్ లో  ప్రస్తుతం పెద్ద ఇన్వెస్టర్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే అనేక ఇళ్లు.. స్థలాలను కొంటూ.. అమ్ముతూ భారీగా లాభాలను ఆర్జిస్తుంది. దీంతో కొన్నాళ్లలోనే లిన్సీ డొనొవాస్ మిలియనీర్ గా మారింది. మధ్య తరగతికి చెందిన లిన్సీ డబ్బు విలువ బాగా తెలుసు.లిన్సీ తన తొలి ఇంటిని 18 ఏళ్లకే కొనుగోలు చేసింది.

ఈ ఐదేళ్లలో తన సంపాదనతో ఆరు లగ్జరీ ఇళ్ళను సొంతం చేసుకుంది. లిన్సీ డొనొవాస్ తన లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఫొటోలు.. వీడియోలనూ తరుచూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని లగ్జరీ హౌస్ ల ఇంటి ఫోటోలను సైతం పోస్ట్ చేస్తూ అమ్మకాలు చేపడుతోంది.

ఇక ఈ అమ్మడు సొంతంగా ఒక 'జూ'ను కూడా కలిగి ఉండటం విశేషం. ఏది ఏమైనా మధ్యతరగతికి చెందిన ఓ అమ్మాయి ఐదేళ్ల కాలంలో కోట్లు కూడబెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. చిన్న వయస్సులో మిలియనీర్ గా మారిన లన్సీపై పలువురు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.