Begin typing your search above and press return to search.

పిచ్చి పీక్స్ః 'అక్క‌డ' లాక్ వేసుకున్న లేడీ

By:  Tupaki Desk   |   20 Jan 2016 8:30 PM GMT
పిచ్చి పీక్స్ః అక్క‌డ లాక్ వేసుకున్న లేడీ
X
పిచ్చి పీక్ స్టేజీకి చేరినపుడు ఎవ‌రినీ ఏం చేయ‌లేం. వారి వింత చేష్ట‌ల‌ను చూసి న‌వ్వుకోవ‌డం త‌ప్ప‌. ఆడ‌వారికి అవ‌నికి ఉన్నంత ఓపిక ఉంటుంద‌ని అనుకుంటాం కానీ అంత‌కంటే ఎక్కువ పిచ్చి కూడా ఉంటుంద‌ని ఇదిగో ఈ బామ్మ‌ను చూస్తేనే అర్థం అవుతుంది.

ఎవ‌రైనా భ‌యం వేస్తే ఏం చేస్తారు? జాగ్ర‌త ప‌డుతారు. కానీ ఇటలీలోని పాడువా నగరంలో అరవై ఏళ్ళ బామ్మ అతి జాగ్ర‌త‌తో హైరానా పెట్టేసింది. త‌న వింత ఆలోచ‌న‌ల‌తో ఏకంగా ప్ర‌భుత్వ అధికారుల‌కు చుక్క‌లు చూపించింది. ఇంత‌కీ విష‌యం ఏంట‌య్య అంటే... ఇటీవ‌లి కాలంలో ఇటలీలో అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ బామ్మగారు అలాంటివన్నీ టీవీల్లో చూసి, పేపర్లలో చదివి భయపడ్డారు పాపం. అరవై ఏళ్ల వయసులో తన మానాన్ని కాపాడుకోవడం కోసం 'అక్కడ' రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది! అదికూడా అలాంటి ఇలాంటిది కాదు. ఆ కవచానికో లాక్ కూడా ఉండే ఏర్పాట్ల‌తో స‌హా.

ఇంత చేసిన ఈ అతి బామ్మ లాక్ వేసింది కానీ తాళం పోగొట్టుకుంది. దీంతో బామ్మ‌గారు ఒంటికీ, రెంటికీ...అన్నింటికీ అవ‌స్థ ప‌డింది. ఆఖ‌రికి దిక్కులేక ఫైర్ ఫైట‌ర్స్‌ కు కాల్ చేసింది. విష‌యం తెలుసుకున్న స‌ద‌రు ఉద్యోగులు షాక్ తిన్నారు. ఇదేం పిచ్చి అనుకొని తంటాలు ప‌డి ఆ క‌వ‌చాన్ని ప‌గ‌ల‌గొట్టి బామ్మ‌కు ఆ విముక్తి క‌లిగించారు.

కొస‌మెరుపుః బామ్మ య‌వ్వారంతో షాక్ తిన్న ఆ ఫైర్ ఉద్యోగులు ఎందుకిలా చేశావే తిక్క‌ల బామ్మ అంటే ఆమేం చెప్పిందో తెలుసా? నన్ను ఎవ‌రూ బ‌ల‌వంతం చేయ‌లేదు కానీ ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చ‌నే భ‌యంతో ఇలా చేశాన‌ని సెల‌విచ్చింద‌ట‌.