Begin typing your search above and press return to search.
భర్తకు ముద్దిస్తా.. ఆపుతావా.? పోలీసులపై లేడి చిందులు
By: Tupaki Desk | 19 April 2021 6:00 PM ISTకరోనా సెకండ్ వేవ్ మళ్లీ మొదలైంది. దేశవ్యాప్తంగా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీలో అయితే లాక్ డౌన్ కూడా ప్రకటించారు. ఇంతటి పెనుముప్పు వేళ బయట మాస్క్ లేకుండా తిరిగితే రూ.1000 వరకు జరిమానాలు విధిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
అయితే ఢిల్లీలో కేసులు, మరణాలు విపరీతంగా పెరిగిపోతున్న వేళ మాస్క్ పెట్టుకోకుండా కారులో తిరుగుతున్న ఓ జంట హల్ చల్ చేసింది. వారిని ఆపిన పోలీసులనే దబాయించారు.
కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మాస్క్ లేకుండా కారులతో ప్రయాణం చేస్తున్న జంటను పోలీసులు ఆపారు. మమ్మల్నే ఆపుతారా అని కారు దిగిన జంట పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ముఖ్యంగా జంటలోని అమ్మాయి అయితే మా నాన్న కూడా పోలీసేనంటూ హల్ చల్ చేసింది.
ఏం చేస్తారో చేసుకోండని నడిరోడ్డుపై జంట ఊగిపోయింది. చివరకు చేసేదేం లేక ఇద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. యువతి చేసిన హంగామా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.