Begin typing your search above and press return to search.

రాష్ట్రపతి మాటలన్నీ కేసీఆర్‌ను ఉద్దేశించినవేనా?

By:  Tupaki Desk   |   5 July 2015 4:49 AM GMT
రాష్ట్రపతి మాటలన్నీ కేసీఆర్‌ను ఉద్దేశించినవేనా?
X
మహారాష్ట్ర గివర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు రచించిన ''ఉనికి'' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గన్న రాష్ట్రపతి ప్రణబ్‌.. రెండు రాష్ట్రాలు సోదరభావంతో మెలగాలని.. ఇరుగుపొరుగుతో గొడవలు లేకుండా.. ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అనుసరించాలంటూ హితబోధ చేసిన విషయం తెలిసిందే.

రాష్ట్రపతి చెప్పిన మాటలకు సరికొత్త భాష్యం ఇస్తున్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేత ఎల్‌. రమణ. పుస్తకావిష్కరణ సభలో ప్రణబ్‌ చేసిన వ్యాఖ్యలన్నీ కూడా కేసీఆర్‌ను ఉద్దేశించి చేసినవేనని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాది కాలంగా కక్షలు.. కార్పణ్యాలతో పాలన సాగించిన విషయాన్ని ఆయన గురు& తచేశారు. ఇకనైనా తన పాలనా పద్ధతుల్ని కేసీఆర్‌ మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

విపక్షాలు లేకుండా చేయాలన్న ఆలోచనకు స్వస్తి పలికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. రాష్ట్రపతి చేసిన సూచనల్ని పాటించాలని కోరుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికి అడ్డుతగలమని చెప్పిన రమణ.. రాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించినవేనని వాదిస్తున్నారు. చూస్తుంటే రాష్ట్రపతి మాటలు ఎవరికి అర్థం అయినా లేకున్నా.. రమణకు బాగా అర్థమైనట్లుంది..?