Begin typing your search above and press return to search.

జొకోవిచ్ కు కఠిన శిక్ష విధించాలట...కిర్గియోస్ డిమాండ్

By:  Tupaki Desk   |   7 Sep 2020 4:30 PM GMT
జొకోవిచ్ కు కఠిన శిక్ష విధించాలట...కిర్గియోస్ డిమాండ్
X
సెర్బియా స్టార్ టెన్నిస్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ తన ఆటతీరుతో పాటు చేష్టలతోనూ పాపులారిటీని సంపాదించాడు. టెన్నిస్ కోర్టులో సీరియస్ గా సర్వ్ చేసే జొకోవిచ్....తన హావభావాలతోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా జరుగుతున్న యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ గెలుచుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేద్దామనుకున్న జొకోవిచ్ ఆ సువర్ణావకాశాన్ని తనే చేజేతులా నాశనం చేసుకున్న సంగతి తెలిసిందే. బుస్టాతో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌లో జొకోవిచ్‌ పూర్తిగా సహనం కోల్పోయాడు. వరుసగా 3 సెట్‌ పాయింట్లను కోల్పోయిన ఫ్రస్ట్రేషన్ లో బంతిని మహిళా లైన్‌ జడ్జిపైకి విసరడంతో ఆమె గొంతుకు గాయమైంది. రూల్స్ బుక్ ప్రకారం జొకో యూఎస్‌ ఓపెన్‌ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో జొకోవిచ్ చర్యను ఆస్ట్రేలియా టెన్నిస్‌ స్టార్‌ నిక్‌ కిర్గియోస్‌ తప్పుబట్టాడు. ఆ పని తాను చేసి ఉంటే ఎన్నేళ్లు శిక్ష విధించేవారో అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించాడు కిర్గియోస్.

గత ఏడాది జరిగిన సిన్సినాటి మాస్టర్స్‌ టోర్నీలో ఓ మ్యాచ్ ఓటమి తర్వాత అంపైర్‌కు కిర్గియోస్ షేక్‌ హ్యాండ్‌ ఇవ్వలేదు. చెత్త అంపైర్‌ అంటూ అతడి వైపు ఉమ్మేశాడు. 2 సార్లు రాకెట్లు విరగ్గొట్టడంత పాటు అసహనం ప్రదర్శించాడు. దీంతో, ఒక్క మ్యాచ్‌లోనే 9 అభియోగాలు నమోదు చేసిన ఏటీపీ...రూ. 80 లక్షలు ఫైన్ తోపాటు 16 వారాల నిషేధం విధించింది. ఈ నేపథ్యంలోనే జొకోవిచ్ పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కిర్గియోస్ సోషల్ మీడియాలో తన అక్కసు వెళ్లగక్కాడు. జొకో చేసిన పని తాను చేసి ఉంటే...ఎన్ని ఏళ్లు శిక్ష విధించి ఉండేవారంటూ నెట్టింట్లో చర్చ పెట్టాడు కిర్గియోస్ అయితే, జొకోవిచ్‌ చేసిన తప్పును కిర్గియోస్ పోల్చుకోవడం సరికాదని, జొకో కు జిరిగింది ఓ దురదృష్టకరమైన ఘటన.అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నట్లుగా జొకొవిచ్ పై మ్యాచ్ రిఫరీ వెంటనే రూల్ బుక్ ప్రకారం చర్య తీసుకున్నారు. మరింత కఠినమైన చర్యల కోసం కిర్గియోస్ చేసిన డిమాండ్ ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి.