Begin typing your search above and press return to search.
అరెరే.. జీతాలివ్వలేని స్థితిలో ఆ సంపన్న దేశం!
By: Tupaki Desk | 25 Sept 2020 11:45 AM ISTఅత్యంత సంపన్న దేశం అది. ఆదాయ మార్గం బాగుండటంతో ఎన్నో ఏళ్ల పాటు వెలిగి పోయింది. ఇంట్లో వంట పని, ఇంటి పనికి కూడా అంతా పరాయి దేశాల నుంచి వచ్చిన వారే. డ్రైవర్లు కూడా అందరూ ఇతర దేశస్థులే. పిల్లల్ని స్కూళ్లకు తీసుకెళ్లేందుకు వాళ్ళ బాగోగులు చూసుకునేందుకు ఆయాలు. ఇలా అన్నింటికీ పని మనుషులు, ఆకాశాన్ని తాకే భవంతులు. ఇలా అన్ని సౌకర్యాలకు నెలవైన కువైట్ దేశం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుంది. కరోనా కారణంగా సంపన్నదేశంగా పేరు తెచ్చుకున్న ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో ఉన్న పనోళ్లకు, సిబ్బందికి కూడా జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పొజిషన్ లో ఉంది.
ముడి చమురును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాల్లో కువైట్ ముందుంది. ఆ దేశానికి 89శాతం ఆదాయం ముడి చమురు నుంచే వస్తుంది. ఇంధన వినియోగం ఎప్పుడూ ఎక్కువేనన్న విషయం తెలిసిందే. అందుకే ఈ వ్యాపారంలో ఇన్నేళ్లు నష్టాలనే మాట లేకుండా వ్యాపారం సాగుతూ వచ్చింది.
కరోనా రాకతో ముడి చమురు నుంచి వచ్చే ఆదాయం బాగా పడిపోయింది. అన్ని దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో వాహనాలన్నీ తిరగడం ఆగింది. జనం చాలా వరకూ ఇళ్లకే పరిమితం అవ్వడంతో ఇంధన వినియోగం తగ్గింది. విమానాల రాకపోకలు కూడా తగ్గి పోయాయి. ముడి చమురు కు ఇలా డిమాండ్ తగ్గిపోయింది. చేసేది లేక ఆదాయ మార్గాల సమీకరణ కోసం కువైట్ ప్రభుత్వం కొత్త రుణ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే, ఈ రుణ చట్టంపై పార్లమెంట్, ప్రభుత్వం మధ్య వివాదం తెలెత్తింది. ఈ చట్టం అమల్లోకి వస్తే కువైట్ తిరిగి ఆర్ధికంగా నిలబడే అవకాశం ఉంది.
2017 లో కూడా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో కూరుకు పోయినప్పుడు కువైట్ ఇంటర్నేషనల్ మార్కెట్ బ్రాండ్లను రిలీజ్ చేసి రుణాలను సమీకరించింది.
అయితే అప్పటి పరిస్థితులు వేరు. ముడి చమురుకు భారీ డిమాండ్ ఉండటం తో బాండ్లను కొనుగోలు చేశారు. కానీ, ఇప్పుడు ముడి చమురుకు డిమాండ్ తగ్గిపోవడంతో ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కరోనా పరిస్థితులతో కువైట్ దాదాపు గా 46 బిలియన్ డాలర్ల ను కోల్పోయింది. అన్ని దేశాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడి, ఆర్థిక వ్యవస్థలు గాడిన పడితే కానీ మళ్లీ ముడి చమురుకు డిమాండ్ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.