Begin typing your search above and press return to search.
కువైట్ సంచలన నిర్ణయం...60 ఏళ్లు పైబడిన ప్రవాసుల జాబితాను సిద్ధం !
By: Tupaki Desk | 4 Sept 2020 12:40 PM ISTయూనివర్సిటీ డిగ్రీ లేకుండా 60 ఏళ్లు పైబడిన ప్రవాసులు పని కోసం తమ దేశానికి రాకుండా అడ్డుకునేందుకు కువైట్ ఓ సరికొత్త రూల్ ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా 59 ఏళ్లు పైబడిన వారికి ఇకపై వర్క్ పర్మిట్ ఒక సంవత్సరానికి మాత్రమే పునరుద్ధరించాలని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ నిర్ణయించింది. అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసులు 60 సంవత్సరాల వయస్సు తర్వాత వారి వర్క్ పర్మిట్ ను పునరుద్ధరించ లేరు.
ఈ నిబంధన జనవరి 1, 2021 నుండి అమలులో వస్తుందని కూడా ఇటీవలే ప్రకటించింది. ఇప్పుడు ఈ నిబంధనను అమలు చేసే దిశగా కువైట్ అడుగులేస్తోంది. ఇప్పటికే కువైట్ లో ఉన్న 60 ఏళ్లకు పైబడిన, యూనివర్సిటీ డిగ్రీ లేని ప్రవాసుల జాబితాను సంబంధిత అధికారులు సిద్ధం చేశారు. ఈ జాబితాలో 68,318 మంది ప్రవాసులు ఉన్నట్లు తాజాగా పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ వెల్లడించింది.