Begin typing your search above and press return to search.

భారత్ కు సన్నిహితుడు కువైట్ రాజు కన్నుమూత

By:  Tupaki Desk   |   30 Sept 2020 10:31 AM IST
భారత్ కు సన్నిహితుడు కువైట్ రాజు కన్నుమూత
X
అరబ్ ప్రపంచంలోనే సంపన్నుడిగా.. ప్రముఖ దౌత్యవేత్తగా.. మానవతావాదిగా గుర్తింపు పొందిన భారతదేశానికి సన్నిహితుడైన కువైట్ రాజ్ ‘షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా (91)’ కన్నుమూశారు. ఈ మేరకు కువైట్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

జులై 17న కువైట్ లో ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. తదుపరి చికిత్స కోసం జులై 19న అమెరికాలోని రోచెస్టర్ లోని మాయో క్లినిక్ లో చేరారు. అక్కడే ఆయన పరిస్థితి విషమించి కన్నుమూసినట్టు సమాచారం.

అమెరికా నుంచి కువైట్ కు రాజు మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. కువైట్ లో సంతాపదినాలు ప్రకటించారు. ప్రస్తుతం రాజు వెంట ఆయన సోదరుడు.. నేషనల్ గార్డ్ డిప్యూటీ కమాండర్ షేక్ మిస్ అల్ అహ్మద్ నేతృత్వంలోని బృందం భౌతికకాయంను తీసుకువస్తున్నారు.

ఇక రాజు ఆస్పత్రి పాలైనప్పటి నుంచి ఆయన కుమారుడు, క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అహ్మద్ అల్ సబా తాత్కాలికంగా కువైట్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. యువరాజు షేక్ నవాఫ్ కే ఇప్పుడు కొన్ని రాజ్యాంగ అధికారాలను అప్పగించారు.

కువైట్ రాజు మృతి పట్ల భారత ప్రధాని నరేంద్రమోడీ సంతాపం తెలిపారు. కువైట్ తోపాటు అరబ్ ప్రపంచం గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.