Begin typing your search above and press return to search.

టీడీపీకి విషాదం.. ఆ సీనియర్ నేత మృతి

By:  Tupaki Desk   |   21 July 2020 11:15 AM IST
టీడీపీకి విషాదం.. ఆ సీనియర్ నేత మృతి
X
మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత జనార్ధన్ థాట్రాజ్ కన్నుమూశారు. ఉత్తరాంధ్రలో సుపరిచితమైన ఆయన.. తాజాగా అనారోగ్యంతో మరణించారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఆయన కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గుండెపోటు రావటంతో హుటాహుటిన విశాఖలోని కేజీహెచ్ కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్స చేస్తున్న సమయంలోనే ఆయన మరణించినట్లుగా చెబుతున్నారు.

మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు స్వయాన మేనల్లుడైన జనార్థన్.. 2009లో కురుపాం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మేనమామ విజయరామరాజుతోకలిసి టీడీపీలో చేశారు. 2014లో కురుపాం నుంచి పోటీ చేసి ఓడిన ఆయన.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నామినేషన్ వేశారు కానీ.. అందులోని పత్రాలుసరిగా లేక నామినేషన్ ను అధికారులు తిరస్కరించారు.

ఆయన కులధ్రువీకరణ పత్రంపై అభ్యంతరాలురావటంతో ఆయన నామినేషన్ చెల్లదని తేల్చారు. అయితే.. నామినేషన్ సమయంలో ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో తనతో పాటు తన తల్లి చేత నామినేషన్ వేయించటం మంచిదైంది. ఆయన నామినేషన్ ను రిజెక్టు చేయటంతో.. పార్టీ అభ్యర్థిగా ఆయన తల్లి బరిలో నిలిచారు.కానీ.. ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కొద్ది రోజులుగా అనారోగ్యంగా ఉంటున్న ఆయన.. తాజాగా గుండెపోటుతో ఆసుపత్రిలో చేరి కన్నుమూయటం టీడీపీకి లోటేనని చెప్పక తప్పదు. ఆయన మరణానికి పార్టీ అధినాయకత్వం సంతాపాన్ని తెలియజేసింది.