Begin typing your search above and press return to search.

భారత్ ఓ మహాశక్తిగా ఎదుగుతుంది.. అమెరికా కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   9 Dec 2022 10:35 AM GMT
భారత్ ఓ మహాశక్తిగా ఎదుగుతుంది.. అమెరికా కీలక ప్రకటన
X
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ పై అమెరికా ప్రశంసలు కురిపించింది. అమెరికా మిత్రదేశంగానే భారత్ ఉండబోదని.. భవిష్యత్తులో మహాశక్తిగా అవతరించనుందని అమెరికా వైట్ హౌస్ సమన్వయకర్త కర్ట్ క్యాంప్ బెల్ సంచలన కామెంట్ చేశారు. గత 20 ఏళ్లలో అమెరికా-భారత్ సంబంధాలు బలపడిన స్థాయిలో మరే దేశంతో ద్వైపాక్షిక బంధం మెరుగుపడలేదని ఆయన అన్నారు. తన దృష్టిలో 21వ శతాబ్ధంలో అమెరికాకు అంత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక బంధం భారత్ తోనే ఉందన్నారు.

'ఆస్పెన్ సెక్యూరిటీ కౌన్సిల్' మీటింగ్ సందర్భంగా ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. 'అమెరికా మరింత దృష్టిపెట్టి ఇరుదేశాల ప్రజల మధ్య బంధాన్ని పెంచేలా టెక్నాలజీ, ఇతర అంశాలపై కృషి చేయాలని క్యాంప్ బెల్ పేర్కొన్నారు.

భారత్ లో విభిన్నమైన వ్యూహాత్మక లక్షణం ఉంది.. అది అమెరికా మిత్రదేశంగా ఉండబోదు.. మరో గొప్ప శక్తిగా అవతరిస్తుంది.. ప్రతీ దశలోనూ వివిధ అంశాల్లో ఇరుదేశాల బంధం మరింత బలపడడానికి చాలా కారణాలున్నాయి. కొంత ఆశయంతో పనిచేయాల్సిన బంధమని నేను నమ్ముతున్నాను.

ఖగోళ, విద్యా, పర్యావరణ, సాంకేతిక రంగాలేవైనా.. మేము చాలా అంశాలను సమష్టిగా చేయగలిగిన కోణంలోనే చూస్తాం. అదే దిశగానూ పనిచేస్తాం. గత 20 ఏళ్ల బంధంలో చాలా అడ్డంకులను తొలగించుకున్నాం.. ఇందుకోసం ఇరువైపులా లోతుగా కృషి చేశామని వ్యాఖ్యానించారు.

భారత్-అమెరికా బంధం చైనాను ఆందోళనకు గురిచేయడానికి ఏర్పడింది కాదని క్యాంప్ బెల్ పేర్కొన్నారు. ఇది సమష్టి కృషి ప్రాముఖ్యాన్ని రెండు దేవాలు లోతుగా అర్థం చేసుకోవడం వల్ల ఏర్పడిందని వెల్లడించారు. క్వాడ్ విషయంలో తాను సానుకూలంగా ఉన్నానని చెప్పారు. అది అనధికారిక వేదికగా మిగిలినా ఆ నాలుగు దేశాల మధ్య బంధం బలపడడానికి చాలా మార్గాలు ఉన్నాయని అన్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.