Begin typing your search above and press return to search.

వైకాపాలోకి కాంగ్రెస్ నాయ‌కుడు

By:  Tupaki Desk   |   6 Aug 2016 3:26 PM IST
వైకాపాలోకి కాంగ్రెస్ నాయ‌కుడు
X
ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఎఫెక్ట్‌తో విల‌విల్లాడుతున్న విప‌క్ష వైకాపాలో కాస్త ఊర‌ట ల‌భించింది. ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఏపీలో విప‌క్ష వైకాపా నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఆప‌రేష‌న్ ఎఫెక్ట్‌ తో క‌ర్నూలు జిల్లాలో వైకాపాకు గ‌ట్టి దెబ్బ ప‌డింది. ఈ జిల్లా నుంచే భూమా నాగిరెడ్డితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయారు. ఈ నేప‌థ్యంలోనే వైకాపాకు కాస్త ఊర‌ట‌లా కాంగ్రెస్‌ కు పార్టీకి జిల్లాలో కీల‌క నేత‌గా ఉన్న వ్య‌క్తి ఒక‌రు త‌న అనుచ‌రుల‌తో వైకాపాలో చేరారు.

క‌ర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉన్న బీవై రామ‌య్య త‌న అనుచ‌రుల‌తో క‌లిసి శ‌నివారం వైకాపాలో చేరారు. వైకాపా జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో వీరంతా వైకాపాలోకి జంప్ చేసేశారు. వీరికి పార్టీ అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి పార్టీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాదారంగా ఆహ్వానించారు. వైకాపాలో చేరిన సంద‌ర్భంగా రామ‌య్య మీడియాతో మాట్లాడారు. తామంతా జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్ని కోరుకుంటున్నామ‌ని...జ‌గ‌న్‌ తోనే రాష్ర్ట అభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని...అందుకే తాము కాంగ్రెస్‌ ను వ‌దిలి వైకాపాలో చేరామ‌ని తెలిపారు.

ఇక వైకాపా జిల్లా అధ్య‌క్షుడు గౌరు వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ క‌ర్నూలు జిల్లా నుంచి ఐదుగురు వైకాపా ఎమ్మెల్యేలు పార్టీ మారినా ఇక్క‌డ ప్ర‌జ‌లంతా జ‌గ‌న్ నాయ‌క‌త్వాన్నే కోరుకుంటున్నారని, వారంతా వైకాపా వైపే ఉన్నార‌ని ధీమా వ్య‌క్తం చేశారు. రాయ‌ల‌సీమ‌కు చంద్ర‌బాబు తీవ్ర అన్యాయం చేస్తున్నార‌న్న ఆయ‌న క‌ర్నూలు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైకాపాదే విజ‌యం అని జోస్యం చెప్పారు. వైకాపాకు మ‌రో శుభ‌సూచ‌కం ఏంటంటే క‌ర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పెద్ద దిక్కుగా ఉండి, రాజ‌కీయంగా మంచి ప‌లుకుబ‌డి ఉన్న కోట్ల ఫ్యామిలీ చూపులు కూడా వైకాపా వైపే ఉన్న‌ట్టు తెలుస్తోంది.