Begin typing your search above and press return to search.

సంగక్కరను అవమానపరిచిన లండన్!

By:  Tupaki Desk   |   12 May 2015 1:09 PM GMT
సంగక్కరను అవమానపరిచిన లండన్!
X
పేరుకే అభివృద్ధి చెందిన దేశాలు తప్ప... కనీస సంస్కారం, విజ్ఞతల్లో వారు చాలా వెనుకబడిన వారు! జాతి అహంకారం, వర్ణ వివక్ష పుష్కలంగా కలిగిఉన్న కొన్ని అగ్రరాజ్యాలు... చాలా మందిని ఎయిర్ పోర్ట్ వేదికగా అవమానపరుస్తున్నాయి! దీనికి సామాన్యులు, సెలబ్రెటీలు అనే తేడా లేదు! షారు ఖాన్ అయిన వారు గుర్తించరు, అబ్దుల్ కలాం అయినా అ వారు విడిచిపెట్టరు! తాజాగా ఇప్పుడు వీరి బారిన ఆస్ట్రేలియా క్రికెటర్ కుమార్ సంగక్కర చేరారు!

కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వెళ్లిన శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కర కు లండన్ ఎయిర్ పోర్టులో అవమానం జరిగింది! ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి తన రంగు పట్ల వివక్ష ప్రదర్శించాడని సంగా ఆరోపిస్తున్నారు! కౌంటీ క్రికెట్‌లో ఆడేందుకు కుమార సంగక్కర లండన్‌కు చేరుకోగా... ఎయిర్ పోర్టులో తనకు ఎదురైన అనుభవాన్ని తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
గత 15 సంవత్సరాలుగా కౌంటీ క్రికెట్ ఆడేందుకు లండన్‌కు వస్తున్నానని... గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఎయిర్ పోర్టు అధికారుల నుంచి తొలి సారి వివక్షను ఎదుర్కొన్నానని కుమార సంగక్కర తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు! ప్రతి ఒక్క ప్రయాణికుడికి మర్యాదివ్వాలి. తనికీలు పక్కగా ఉండాలి కానీ... అవి అవతలి వ్యక్తిని బాదించే స్థాయిలోనో, అవమానపరిచే రీతిలోనో ఉండకూడదని సంగా అభిప్రాయపడ్డారు!