Begin typing your search above and press return to search.
కేటీఆర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట..
By: Tupaki Desk | 26 Jun 2019 4:25 PM ISTతెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడనే విషయం చుట్టే ఇన్నాళ్లు జోరుగా చర్చ సాగింది. వరుస ఎన్నికలు ఉండడం.. ఎన్నికల కోడ్ ఉండడంతో తన కుమారుడిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు కేసీఆర్. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేసి పార్టీ వ్యవహారాలను అప్పగించారు. ఇప్పుడు ఎన్నికలన్నీ అయిపోయాయి. ఈ నెలలోనే జూలైలో మున్సిపల్ ఎన్నికలు ముగియనున్నాయి.
అయితే గడిచిన తెలంగాణ మంత్రివర్గంలో కేటీఆర్ పాత్ర అమోఘమైనది. దేశ విదేశాలు తిరిగి తెలంగాణకు పెట్టుబడుల వరద పారించారు. హైదరాబాద్ లో అంతర్జాతీయ సదస్సులు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఉత్తమ మంత్రిగా పలు అవార్డులను కూడా చేజిక్కించుకున్నారు. ఐటీ, పరిశ్రమలు, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలను పరుగులు పెట్టి తనదైన మార్క్ ను చూపించారు. అంతటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కేటీఆర్ ను పక్కన పెట్టడం ఆయా శాఖలపై కూడా ప్రభావం చూపుతోందట.. ఆరు నెలల్లో ఆయా శాఖల్లో పాలన ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందట.. అందుకే కేసీఆర్ పనిభారం తగ్గించుకునేందుకు తిరిగి పాలనను పట్టాలెక్కించేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కేటీఆర్ ను మంత్రివర్గానికి దూరంగా ఉంచడం మంచిది కాదని పార్టీలోని సీనియర్లు కేసీఆర్ చెవిన వేసినట్టు తెలిసింది. కేసీఆర్, కేటీఆర్ లు కలిస్తే అద్భుతమైన అడ్మినిస్ట్రేషన్ సాధ్యమవుతుందని.. వీలైనంత తొందరగా కేటీఆర్ ను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ వ్యక్తమవుతోందట.. ఇప్పుడు కేటీఆర్ కేంద్రంగానే టీఆర్ ఎస్ లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది. మళ్లీ కేటీఆర్ మంత్రివర్గంలోకి వస్తే ఆయా శాఖల పనితీరుతోపాటు పెట్టుబడులు, ఇతర రంగాల్లో మార్పు ఖాయం. అందుకే ఆయన రాకకోసం ఇప్పుడు పార్టీలోనే కాదు.. బయటి వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ఇక మంత్రివర్గ విస్తరణలో కేటీఆర్ తోపాటు హరీష్, ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు చోటు ఖాయంగా కనిపిస్తోంది. కేటీఆర్ మంత్రివర్గంలోకి వస్తున్నారన్న చర్చ ఇప్పుడు ఆ పార్టీలో నూతనోత్సాహాన్ని కల్పిస్తోంది. ఇక సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ తన సొంత జిల్లాల్లో అభివృద్ధి పనులను కూడా నెలరోజుల పాటు వాయిదా వేశారట.. మంత్రిగానే ప్రారంభోత్సవం చేయడానికి వీలుగా ఇలా చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.