Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ బాటలో వాట్సాప్..కేటీఆర్ మీట్..

By:  Tupaki Desk   |   24 Aug 2018 3:09 PM IST
ఫేస్ బుక్ బాటలో వాట్సాప్..కేటీఆర్ మీట్..
X
ఫేస్ బుక్ - వాట్సాప్.. ప్రస్తుతం ఈ రెండూ లేనిదే మనకు పూట గడవని పరిస్థితి. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతం మరింత ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం భారత్ ను స్వర్గధామంగా ఎంచుకుంది..

ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ విస్తరణ బాటలో ఉంది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం వాట్సాప్ సీఈవో క్రిస్ డేనియల్... కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ ను కలిశారు. క్రిస్ డేనియల్ ఐదు రోజుల పర్యటన నిమిత్తం భారత్ పర్యటనకు వచ్చారు.

క్రిస్ డేనియల్ గురువారం హైదరాబాద్ వచ్చాడు. వాట్సప్ మాతృసంస్థ ఫేస్ బుక్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఐటీ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ... హైదరాబాద్ లో ఫేస్ బుక్ పీపీడీ హెడ్ శివనాథ్ తో కలిసి క్రిస్ డేనియల్ ను కలిశారు. ఈ సందర్భంగా వాట్సప్ - ఫేస్ బుక్ కార్యకలాపాలపై చర్చించారు. హైదరాబాద్ లో కస్టమర్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయాలని డేనియల్ కు విజ్ఞప్తి చేశారు. దీనికి వాట్సాప్ సీఈవో సానుకూలంగా స్పందించారని ఐటీశాఖ వర్గాలు తెలిపాయి.