Begin typing your search above and press return to search.

ఎమ్మెల్యేల జాబితాపై కేటీఆర్ అసంతృప్తి?

By:  Tupaki Desk   |   10 Sept 2018 7:15 PM IST
ఎమ్మెల్యేల జాబితాపై కేటీఆర్ అసంతృప్తి?
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల రంగం సిద్ధ‌మ‌వుతోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే 105 మంది అభ్య‌ర్థుల జాబితాను కూడా ఆప‌ద్ధ‌ర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ విడుద‌ల చేశారు. ఈ నేప‌థ్యంలోనే టీఆర్ ఎస్ లో టికెట్ వార్ మొద‌లైందట‌. ఆ జాబితా ప్ర‌క‌టించ‌క‌ముందు టికెట్ ఆశించిన‌వారంతా భంగ‌ప‌డ్డార‌ట‌. గ‌తంలో కేటీఆర్ ను ఆశ్ర‌యించి టికెట్ కోసం లాబీయింగ్ చేసిన వారి పేర్లు ఆ జాబితాలో లేవు. దీంతో, వారంతా కేటీఆర్ చుట్టూ ప్ర‌ద‌క్షిణలు చేస్తున్నార‌ట‌. గతంలోనే కేటీఆర్ కు వారంతా గ‌ట్టిగానే ముట్ట జెప్పిన‌ట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో, త‌ను ఆల్రెడీ క‌మిట్ అయిన వారికి టికెట్లు ద‌క్కేలా కేసీఆర్ తో కేటీఆర్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. కానీ, కేసీఆర్ మాత్రం టికెట్ల కేటాయింపులో త‌న‌దే తుది నిర్ణ‌య‌మ‌ని తేల్చి చెప్పిన‌ట్లు పుకార్లు వ‌స్తున్నాయి.

ప్ర‌స్తుతం కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ న‌డుస్తోంద‌ని పుకార్లు వినిపిస్తున్నాయి. త‌న‌ను న‌మ్ముకున్న వారికి పార్టీ టికెట్ ఇప్పించేందుకు కేటీఆర్ ...త‌న తండ్రి కేసీఆర్ ను క‌న్విన్స్ చేసే ప‌నిలో ప‌డ్డార‌ట‌. కేసీఆర్ ను క‌లిసి టికెట్ అడ‌గ‌డం క‌ష్టం క‌నుక‌....చాలామంది కేటీఆర్ ను గ‌తంలో అప్రోచ్ అయ్యారు. అయితే, కేసీఆర్ ఏకంగా 105 మంది జాబితాను విడుద‌ల చేసేస‌రికి,....కేటీఆర్ ను న‌మ్ముకున్న వారికి టికెట్ ద‌క్క‌లేదు. దీంతో, వారంతా కేటీఆర్ ద‌గ్గ‌ర ల‌బోదిబో మంటున్నార‌ట‌. వారిలో న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కూడా ఉన్నారు. ఉప్ప‌ల్ నుంచి ఆయ‌న టికెట్ ఆశించ‌గా...దానిని బేతి సుభాష్ రెడ్డికి కేసీఆర్ కేటాయించార‌ట‌. దీంతో, కేసీఆర్ కు న‌చ్చ‌జెప్పేందుకు కేటీఆర్ ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. అయితే, టికెట్ల విష‌యంలో జోక్యం వ‌ద్ద‌ని - స‌ర్వే నివేదిక‌ల ప్రకారం గెలుపు గుర్రాల‌కే టికెట్లు కేటాయిస్తాన‌ని కేసీఆర్ తేల్చి చెప్పార‌ట‌. దీంతో, కేటీఆర్ క‌క్క‌లేక‌...మింగ‌లేక‌...ఉన్నార‌ట‌. మ‌రి, కేసీఆర్ కుటుంబంలో ఈ టికెట్ కోల్డ్ వార్ భ‌విష్య‌త్తులో దేనికి దారి తీస్తుందో వేచి చూడాలి.