Begin typing your search above and press return to search.
మోడీ సర్కారును ట్వీట్లతో ఛేజ్ చేస్తున్న కేటీఆర్
By: Tupaki Desk | 30 Dec 2021 7:00 PM ISTలెక్కలు బాగున్నంత వరకు ఓకే. ఏ మాత్రం తేడా కొట్టినా విశ్వరూపం చూపించే నేతలు తెలుగు రాష్ట్రాల్లో చాలామందే ఉంటారు. కానీ.. ఇప్పటివరకు మరే నేత చేయని రీతిలో.. కేంద్రంలోని మోడీ సర్కారును టార్గెట్ చేసి.. డైలీ బేసిస్ లో ట్వీట్లతో పంచ్ ల మీద పంచ్ లు వేసే విషయంలో టీ మంత్రి కేటీఆర్ ఏ మాత్రం తగ్గట్లేదు. నిన్నటికి నిన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన లిక్కర్ ధరల తగ్గింపుపై పంచ్ ట్వీట్ విసిరిన ఆయన.. ఈ రోజు అందుకు భిన్నంగా గుజరాతీల మాటను తీసుకొచ్చి.. మోడీ సర్కారును ఇరుకున పడేలా ట్వీట్ చేశారు.
కేంద్ర టెక్స్ టైల్స్ శాఖా మంత్రి పీయూష్ గోయిల్ కు చురకలు అంటేలా కేటీఆర్ ట్వీట్ ఉండటం గమనార్హం. వస్త్రాల మీద ఇప్పటివరకు ఉన్న 5 శాతం జీఎస్టీని 12 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. జనవరి 1 నుంచి ఈ కొత్త పన్ను పోటు అమల్లోకి వచ్చేస్తున్న వేళ.. వస్త్ర వ్యాపారులు తీవ్రంగా మండిపడుతున్నారు. జాతీయ స్థాయిలో నిరసనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటివేళ.. వస్త్రాల మీద 12 శాతం నుంచి 5 శాతానికి జీఎస్టీ తగ్గించాలని కోరుతున్నారు.
వస్త్రాల మీద పెంచిన జీఎస్టీని తగ్గించాలని కేంద్ర మంత్రి దర్శన్ జర్దోష్.. గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ చేసిన డిమాండ్ ను టైమ్లీగా ప్రస్తావిస్తూ.. ''మమ్మల్ని పట్టించుకోకపోయినా..కనీసం గుజరాత్ ను అయినా పట్టించుకోవాలి'' అంటూ కేంద్రమంత్రి పీయూష్ కు మంట పుట్టేలా ట్వీట్ చేశారు. అన్ని రకాల వస్త్రాల మీద జీఎస్టీని 5 నుంచి 12 శాతాన్ని పెంచాలన్న నిర్ణయాన్ని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఉంది. అయినప్పటికీ.. ఈ విషయంలో కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో మమ్మల్ని.. మా మాటను ఎటూ పట్టించుకోరు.. కనీసం మీ పార్టీకి చెందిన కేంద్రమంత్రి.. పార్టీరాష్ట్ర అధ్యక్షుడు మాటల్ని అయినా పట్టించుకోవాలంటూ వేసిన చురక ఇప్పుడు అందరిని ఆకట్టుకొంటోంది. ఏమైనా.. బీజేపీ చేసే తప్పుల్ని.. వారికే ముడి పెడుతూ.. కేటీఆర్ చేస్తున్న ట్వీట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. మరి.. ఈ ట్వీట్ల ఛేజింగ్ మరెంత కాలం సాగుతుందో చూడాలి.