Begin typing your search above and press return to search.

జగన్ ను వదిలేసి కేటీఆర్ ను వెతికేస్తున్నారట

By:  Tupaki Desk   |   24 Jun 2016 9:44 AM GMT
జగన్ ను వదిలేసి కేటీఆర్ ను వెతికేస్తున్నారట
X
రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొందరు తెలీక తప్పులు చేస్తే.. మరికొందరు తెలిసీ తప్పులు చేస్తారు. ఏపీ విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత తీరు కూడా అదే మాదిరి ఉంటుంది. అలాంటి వైఖరి ఆయా నేతల మీద ఉన్న ఆదరణను మరింత తగ్గేలా చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని యువ నేతల విషయానికి వస్తే ఇది విషయం స్పష్టమవుతోంది. ఒకప్పుడు గూగుల్ సెర్చ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువగా ఉండేది.

అయితే.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నట్లుగా తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్ జోరు పెరుగుతోందని.. ఆన్ లైన్ లో ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకోవటానికి ఆసక్తి వ్యక్తమవుతోందని తేలింది.

గూగుల్ సెర్చ్ కు సంబంధించి యువనేతల్లో కేటీఆర్ ముందుంటే.. జగన్ వెనుకబడిపోతున్నట్లు చెబుతున్నారు. ఇక.. స్వల్ప వ్యవధిలోనే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం చేస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదరణ పెరుగుతున్నట్లు గుర్తించారు. 2014 ఎన్నికల సమయంలో గూగుల్ సెర్చ్ లో జగన్ కంటే వెనుక పడ్డ చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా తన సత్తాను చాటుతున్నారని చెబుతున్నారు. యువనేత విషయంలో మాత్రం కేటీఆర్ కు ఆదరణ రోజురోజుకి పెరగటం గమనార్హం.