Begin typing your search above and press return to search.
శ్రీధర్ బాబు వద్దకు కేటీఆర్.. ఈటెల ముచ్చట్లు ఏమిటో?
By: Tupaki Desk | 25 March 2021 4:00 PM ISTతాజాగా జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సీన్లు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు వద్దకు మంత్రులు కేటీఆర్.. ఈటెల వెళ్లి ముచ్చట్లు చెప్పటం ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడప్పుడు ఘాటైన విమర్శలు సంధించే శ్రీధర్ బాబు వద్దకు కేటీఆర్ వెళ్లి కాసేపు మాట్లాడటం కనిపించింది. బయట నుంచి సభ లోపలకు వచ్చిన కేటీఆర్.. నేరుగా శ్రీధర్ బాబు సీటు వద్దకు వచ్చి కాసేపు మాట్లాడారు.
మరో మంత్రి ఈటెల రాజేందర్ సైతం శ్రీధర్ బాబు సీటు వద్దకు వచ్చి.. కాసేపు మాట్లాడి వెళ్లారు. వీరు ముగ్గురు దగ్గర దగ్గర పది నిమిషాలకు పైనే మాట్లాడుకోవటం.. మాటల మధ్యలో నవ్వుకోవటం ఆసక్తికరంగా మారింది. వారేం మాట్లాడుకున్నారన్నది బయటకు రాలేదు. ఇదిలా ఉంటే.. బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ వద్దకు మంత్రి ఈటెల వెళ్లటం.. మాట్లాడటం కనిపించింది. మరో మంత్రి ప్రశాంత్ రెడ్డి కూడా రఘునందన్ వద్దకు వచ్చి కూర్చోవటం..కాసేపు మాట్లాడటం ఆసక్తికరంగా మారింది.
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మాత్రం తానే మంత్రి కేటీఆర్ సీటు వద్దకు వెళ్లారు. ఆయనతోదాదాపు అరగంట సేపు మాట్లాడటంగమనార్హం. మొత్తానికి రేర్ కాంబినేషన్లు కొన్ని అసెంబ్లీ సాక్షిగా ముచ్చట్లు పెట్టుకోవటం అందరిని ఆకర్షించింది. బయట ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుకుంటూ విమర్శలు సంధించుకునే నేతలు అసెంబ్లీలో మాత్రం కులాశాగా ముచ్చట్లు పెట్టుకోవటం చూస్తే.. అసలు రాజకీయం ఇది కాదా? అన్న భావన కలుగక మానదు.