Begin typing your search above and press return to search.
కేటీఆర్..లీడర్ ఆఫ్ ది ఇయర్
By: Tupaki Desk | 18 Dec 2017 9:55 AM ISTఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకొన్న తెలంగాణ ఐటీ - పరిశ్రమలు - పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ఏటా ఇచ్చే లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మంత్రి కేటీఆర్ కు ప్రకటించింది. పట్టణ మౌలిక వసతులున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎంపిక చేసింది. ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
నూతన రాష్ట్రాన్ని మంత్రి కేటీఆర్ దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపిన తీరును బిజినెస్ వరల్డ్ అభినందించింది. పాలనాపరంగా ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలు - రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నతీరు - దేశవ్యాప్తంగా మంత్రికి లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డు ఇస్తున్నట్టు బిజినెస్ వరల్డ్ తెలిపింది. మంత్రి కేటీఆర్ కు లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించిన బిజినెస్ వరల్డ్ సంస్థ ఈ నెల 20న స్మార్ట్ - సేఫ్ - సస్టైనబుల్ సిటీస్ అనే అంశంపై నిర్వహిస్తున్న ఐదో జాతీయ స్మార్ట్ సిటీ కాన్ఫరెన్స్ లో పాల్గొనాలని ఆయనకు ఆహ్వానం పంపింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొననున్న సమావేశంలో నగరాల్లో సమీకృత రవాణా వ్యవస్థ - స్మార్ట్ హెల్త్ కేర్ - డిజిటలైజేషన్ ద్వారా పట్టణ సమస్యల పరిష్కారాలను చర్చించనున్నారు.
దీంతో పాటుగా పట్టణ మౌలిక వసతులున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డును అందించనుంది. పట్టణాల్లో మిషన్ భగీరథ (అర్బన్) ద్వారా ఇంటింటికి రక్షిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని బిజినెస్ వరల్డ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం - డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పట్టణాల్లో అమలుచేయటం - హైదరాబాద్ నగరంలోనే లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా పేద ప్రజలకు పక్కాగృహాలు సమకూర్చేందుకు చేస్తున్నకృషిని పరిగణనలోకి తీసుకొన్నట్టు బిజినెస్ వరల్డ్ వివరించింది.