Begin typing your search above and press return to search.

కేటీఆర్ రాజకీయాలు వదిలేద్దామనుకున్న వేళ..

By:  Tupaki Desk   |   13 March 2017 1:25 PM IST
కేటీఆర్ రాజకీయాలు వదిలేద్దామనుకున్న వేళ..
X
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేటీఆర్ కు ఉన్న ప్రాధాన్యమేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కొన్నేళ్ల కిందట కేటీఆర్ రాజకీయాలే వదిలేద్దామనుకున్నాడట. అలాంటి సమయంలో ఓ సినీ దర్శకుడు రాసిన ఆర్టికల్ చదివి స్ఫూర్తి తెచ్చుకుని.. రాజకీయాల నుంచి నిష్క్రమించే ఆలోచనను మానుకున్నాడట కేటీఆర్. దీనికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు కేటీఆర్ మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘2008 ఉప ఎన్నికల్లో మా పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పూర్తిగా నిరాశలో కూరుకుపోయాం. ఆ దశలో మా పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేయాలేమో అనిపించింది. ఒకవేళ అదే జరిగితే రాజకీయాలు వదిలేద్దామనుకొన్నా. కానీ అదే సమయంలో ఓ పత్రికలో చదివిన వ్యాసం నన్ను ఉత్తేజితుణ్ని చేసింది. ఆ వ్యాసం రాసింది ప్రేమ్‌రాజ్‌ అని తెలిసింది. ఆయన్ని కలుసుకొని మాట్లాడాను’’ అని కేటీఆర్ చెప్పాడు. ఈ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన ‘శరణం గచ్ఛామి’ సినిమా ఆడియో వేడుకలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

తమ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లవుతున్నా ప్రేమ్ రాజ్ తనను ఏనాడూ ఏ సహాయమూ అడగలేదని.. ఆయన తీసింది మూడు సినిమాలే అయినా.. రాశి కాదు వాసి ముఖ్యమని చాటారని.. ‘శరణం గచ్ఛామి’ సినిమాకు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ అన్నారు. ఈ రోజుల్లో చిన్న సినిమా.. పెద్ద సినిమా అనే తేడా లేదని. దమ్ముంటే అదే పెద్ద సినిమా అని.. ఆ సత్తా ‘శరణం గచ్ఛామి’లో కనిపిస్తోందని.. ఈ రోజుల్లో ఇలాంటి కథాంశం ఎంచుకోవడం సాహసమే అని కేటీఆర్ చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/