Begin typing your search above and press return to search.
పార్టీపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్న కేటీఆర్
By: Tupaki Desk | 4 Jan 2019 2:01 PM ISTటీఆర్ ఎస్ లో కల్వకుంట్ల తారకరామారావు శకం మొదలైందా అంటే అవుననే సమాధానం పార్టీలో బలంగా వినిపిస్తుంది. టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీపై తన ఆధిపత్యాన్ని పూర్తిగా ప్రదర్శిస్తున్నారు. తన మార్క్ రాజకీయాలతో దూసుకెళుతున్నారు. పార్టీలో పొలిట్ బ్యూరోలో చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయాలను సైతం తానే స్వయంగా ప్రకటిస్తూ తన మాటకున్న పవర్ ఏంటో చెప్పకనే చెబుతున్నారు.
కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం పార్టీలో కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. దీని ద్వారా పార్టీ నిర్ణయాలన్నీ కేటీఆర్ చేతుల్లోనే పెట్టారు కేసీఆర్. ఇక ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తన మార్క్ వేగంతో పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
కేటీఆర్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత పలు జిల్లాలో పర్యటించారు. సభలు - సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో తానే సుప్రీం అన్న సంకేతాలను శ్రేణులకు పంపిస్తున్నారు. ఇటీవల కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ పేరును కేటీఆర్ స్వయంగా ప్రకటించడం ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.. మామూలుగా కేటీఆర్ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు.
ఇక పార్టీ పదవులు ఆశిస్తున్న అభ్యర్థులు కేటీఆర్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలు - మంత్రులు - నామినేటెడ్ పదవులు దక్కాలంటే కేటీఆర్ అభయం తప్పనిసరి అని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆశావహులు కేటీఆర్ దృష్టిలో పడే ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ దర్శనభాగ్యం కోసం వయోబేధం తేడా లేకుండా గంటల తరబడి వేచిచూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక కల్వకుంట తారాకరావు శకం ప్రారంభమైందని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.