Begin typing your search above and press return to search.

అష్టదిగ్భంధనం.. కేటీఆర్ చిక్కుకున్నారు..

By:  Tupaki Desk   |   26 Sept 2019 11:00 AM IST
అష్టదిగ్భంధనం.. కేటీఆర్ చిక్కుకున్నారు..
X
దాదాపు 100 ఏళ్లలో ఎన్నడూ కొట్టని స్థాయిలో భారీ వర్షాలు హైదరాబాద్ ను ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. నేడు - రేపు కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం అనడంతో అంతటా అప్రమత్తత నెలకొంది.

అరేబియా సముద్రంలో ఏర్పడ్డ హికా తుఫాన్ తోపాటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు హైదరాబాద్ జలమయమైంది. మల్కాజిగిరిలో అత్యధికంగా 20 సెం.మీల వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో అష్టకష్టాలు పడుతున్నారు.

కాగా హైదరాబాద్ లో వివిధ సమీక్షలు - పనుల కోసం బయటకు వెళ్లిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్రాఫిక్ జామ్ లు చిక్కుకుపోయారు. ముందుకు వెళ్లలేక - వెనక్కి వెళ్లలేక భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ జామ్ లో అష్టదిగ్భంధనం అయ్యారు. చాలా సేపు ట్రాఫిక్ లోనే కేటీఆర్ ఉండాల్సి వచ్చింది.

ఇక మంత్రి కేటీఆర్ పాటు చాలా మంది కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుపోవడంతో జీహెచ్ ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. వరద నీరు క్లియర్ చేసి ట్రాఫిక్ ను క్రమబద్దీకరించేందుకు నానా పాట్లు పడ్డారు. ఎట్టకేలకు కేటీఆర్ కాన్వాయిని క్లియర్ చేశారు.

ఇక నేడు, రేపు కూడా భారీ వర్షాల హెచ్చరికలతో జీహెచ్ ఎంసీతోపాటు డీఆర్ ఎఫ్ఎం టీమ్ లను సైతం రంగంలోకి దించి రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.