Begin typing your search above and press return to search.
ఎకనామిక్స్ టైమ్స్‌ను ఏకి పారేసిన కేటీఆర్
By: Tupaki Desk | 29 Jun 2017 6:11 PM ISTఎకనామిక్ టైమ్స్ పత్రిక తెలంగాణలో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కామ్.. గూగుల్ - మైక్రోసాఫ్ట్ లు ప్రభావితం అనే కథనాన్ని ఇటీవల ప్రచురించింది. ఆ కథనం నిరాధారమైన కట్టుకథ అంటూ రాష్ట్ర పురపాలక - ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తీవ్రంగా స్పందించారు. రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడితే.. కోర్టుల్లో విచారణ జరుపవచ్చు లేదా ఎన్నికల్లో చిత్తుగా ఓడించవచ్చు. కానీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే నాలుగో స్తంభమే అవినీతిలో కూరుకుపోతే.. అది దేశ ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరం అని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. పదేళ్ల క్రితం జరిగిన స్థలాల కేటాయింపులపై ఎకనామిక్ టైమ్స్ వండివార్చిన కథనానికి ఆయన బదులిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచి ఎకనామిక్ టైమ్స్.. అంతర్జాతీయ పెట్టుబడిదారుల ముందు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా తప్పుడు కథనాలను వండివార్చుతున్నదని విమర్శించారు.
ఎకనామిక్ టైమ్స్ పత్రికపై కేటీఆర్ ప్రతిస్పందన ఇది ``మన దేశంలో ప్రసార మాధ్యమాలను ఎంతగానో గౌరవిస్తాం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా అభివర్ణిస్తాం. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ - శాసనవ్యవస్థ - న్యాయవ్యవస్థలతోపాటు మీడియా పాత్ర అత్యంత కీలకమైనది. ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా మీడియా - పత్రికలు శక్తిమంతమైనవి. మన దేశంలో రాజకీయ వ్యవస్థ అవినీతి - అక్రమాలకు పాల్పడితే పత్రికలు - మీడియా ముందువరుసలో నిలిచి, వాటిని బయటపెట్టాయి. రాజకీయ నాయకుల చీకటి లావాదేవీల గుట్టు ప్రజల ముందు బయటపెట్టేదీ మీడియానే. కొన్ని కేసులలో ఎన్నికైన అభ్యర్థుల తలరాతలనే మార్చివేసింది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేందుకు పాటుపడుతూ, సరికొత్త ఉత్సాహాన్ని నింపడంలో మీడియాది కీలక పాత్ర. స్వాతంత్య్రం తర్వాత మన దేశంలో ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం నెలకొని ఉంది. కార్యనిర్వాహక వ్యవస్థ - శాసనవ్యవస్థ - న్యాయవ్యవస్థకు లేని వెసులుబాటు మీడియాకు ఉంది. మీడియా సంస్థలు కూడా స్వాతంత్య్రం నాటి నుంచి ఈ స్వేచ్ఛను ఎంతో పరిణతితో, బాధ్యతాయుతంగా వినియోగిస్తున్నాయి. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం ఈ స్వేచ్ఛను సంచలనాలకోసం వాడుకుంటూ సమాజానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ స్వేచ్ఛాయుత సంచలనాత్మక ధోరణికి అడ్డుకట్ట పడేది ఎప్పుడు? బాధ్యత - జవాబుదారీతనం మొదలయ్యేది ఎక్కడ? తెలంగాణ రాష్ట్రం విషయంలో ఈ ప్రశ్నలు ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే ఇటువంటి తప్పుడు ప్రచారాలకు, ద్వేషపూరిత కథనాలకు ఉద్యమ సమయంలో తెలంగాణ బాధితురాలు.`` అని విశ్లేషించారు.
నిందలు వేసేవారిని ఎదుర్కొనడం తెలంగాణకు కొత్తేమీ కాదని కేటీఆర్ అన్నారు. ``రాష్ట్ర సాధన ఉద్యమం రోజుల్లో ఇలాంటివాళ్లు ఎంతోమంది ఉండేవారు. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారు తెలంగాణ అంధకారం అవుతుందని జోస్యాలు చెప్పారు. కానీ.. ఈ రోజు మండు వేసవిలోనూ పరిశ్రమలకు విద్యుత్ ను సరఫరా చేస్తున్నది. తెలంగాణ ఏర్పడితే పరిశ్రమలన్నీ తరలిపోతాయని, అభివృద్ధి కుంటుపడుతుందని దుష్ప్రచారం చేశారు. కానీ.. నేడు దానికి పూర్తి భిన్నమైన వాతావరణం రాష్ట్రంలో సాక్షాత్కరించింది. తెలంగాణ రాష్ట్రం అనూహ్యంగా వృద్ధి చెందుతున్నది. ఐటీ ఎగుమతుల్లో దేశీయ సగటుకంటే రాష్ట్ర సగటు అధికంగా నమోదైంది. తలసరి ఆదాయం విషయానికి వస్తే.. దేశంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తెలంగాణ ఖ్యాతికెక్కింది. ప్రపంచంలోనే పేరెన్నిక గల ఐదు దిగ్గజ కంపెనీల్లో నాలుగు హైదరాబాద్ లోనే కార్యాలయాలు ఏర్పాటుచేశాయి. మైక్రోసాఫ్ట్ - గూగుల్ - ఆపిల్ - అమెజాన్ - ఉబర్ - సేల్స్ ఫోర్స్ - బోయింగ్ - డీబీఎస్ - జెడ్ ఎఫ్ వంటివి నగరానికి వచ్చాయి. గత రెండేళ్లలో చారిత్రాత్మక - విప్లవాత్మకమైన విధానం టీఎస్-ఐపాస్ ద్వారా కేవలం పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులను మంజూరు చేస్తున్నది. ఇందులో భాగంగా, నేటివరకు సుమారు 3,828 సంస్థలకు అనుమతినివ్వగా.. అందులో దాదాపు యాభై శాతం కంపెనీలు కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కొత్త రాష్ట్రంలో ఐటీరంగంలో 1,04,495 మందికి, పారిశ్రామికరంగంలో 2,28,355 మందికి ఉద్యోగాలను కల్పించింది. రాష్ట్ర జీడీపీ 10.1 శాతానికి పెరిగింది. ఇతర రాష్ర్టాలతో పోల్చితే అధిక జీడీపీలో రాష్ట్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్త.. రాష్ట్ర ప్రభుత్వ డైనమిజాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. కొత్త పరిశ్రమలను తీసుకురావడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, ఉద్యోగితను పెంపొందించడానికి కొత్త రాష్ట్రం అహర్నిశలు శ్రమిస్తుంటే.. కొన్ని వార్తాసంస్థలు డబ్బులు తీసుకుని కథనాలు రాయడం ద్వారా రాష్ట్రానికి మకిలి అంటించే ప్రయత్నాలు చేస్తున్నాయి`` అని మండిపడ్డారు.
ఇదే క్రమంలో, ఇటీవల ఎకనామిక్ టైమ్స్ తెలంగాణలో రూ.15,000 కోట్ల విలువైన అతిపెద్ద రియాల్టీ స్కామ్.. గూగుల్ - మైక్రోసాఫ్ట్ లు ప్రభావితం అనే కథనాన్ని ప్రచురించడం ద్వారా సంచలనాత్మక జర్నలిజంలో మరింత నీచానికి దిగజారిపోయింది. ఈ కథనంలో పేర్కొన్న ఉదంతాలన్నీ తెలంగాణ ఆవిర్భావానికంటే ముందటివి. కొన్ని పదేళ్ల క్రితం చోటుచేసుకున్నవీ ఉన్నాయి. కొత్త రాష్ర్టానికి ఇలాంటి సమస్యలు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా సంక్రమించాయనేది అందరికీ తెలిసిందే. ఈ కథనంలో పేర్కొన్న కుంభకోణాల్లో ఒకదానిని తెలంగాణ ప్రభుత్వమే అంతర్గత ఆడిటింగ్ ద్వారా వెలికితీసింది. దానిని సరిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్నది. ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికే ఎకనామిక్‌టైమ్స్ పత్రిక మైక్రోసాఫ్ట్, గూగుల్ కంపెనీల పేర్లను వాడుకుంది. అదే సమయంలో ఆ కంపెనీల ప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోవడంలో విఫలమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు జరిగిన వ్యవహారాలను ఈ కథనంలో జొప్పించి.. పెట్టుబడిదారుల ముందు కొత్త రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేసిందనేది స్పష్టంగా తెలిసిపోతున్నది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహించే జేఎల్‌ఎల్ (జోన్స్ లాంగ్ లసాల్), సీబీఆర్‌ఈ వంటివి ఎకనామిక్ టైమ్స్ రాసినది తప్పుడు కథనమని, కేవలం సంచలనం కోసమే ప్రచురించిందని పేర్కొన్నాయి. కొన్ని వార్తాపత్రికలు, టీవీ చానళ్లు రాష్ట్ర సాధన ఉద్యమంపై తప్పుడు కథనాలు రాశాయి, ప్రసారం చేశాయి`` అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యమ సమయంలోనే తమ నాయకులను అపహాస్యం చేశాయని కేటీఆర్ పేర్కొన్నారు. `` కొత్త రాష్ట్రం ఏర్పడితే విలయమేనని జోస్యాలు చెప్పాయి. కొన్ని మీడియా సెక్షన్లు పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం వాస్తవరూపం దాల్చింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత దేశంలోని చాలా పత్రికలు కొత్త రాష్ట్రాన్ని ఆమోదించాయి. తమ ద్వేషభావాన్ని పక్కన పెట్టేసి.. తటస్థ వైఖరినో, లేదా స్తబ్దతనో అనుసరించాయి. కానీ, కొన్ని పత్రికలు కొత్త రాష్ట్రం స్వేచ్ఛావాయువులను పీల్చుకోవడానికీ సమయం ఇవ్వకుండా అపవాదులను అంటగడుతున్నాయి. ఇప్పుడిప్పుడే రెక్కలు తొడుక్కుంటున్న రాష్ట్రం అభివృద్ధికోసం చేస్తున్న కృషికి ఉద్దేశపూర్వకంగా వెన్నుపోటు పొడుస్తున్నాయి. తెలంగాణ ఆవిర్భవించిన నాలుగు వారాల్లోపే ఎకనామిక్ టైమ్స్ (ఈటీ) పత్రిక సుమారు ఏడు వందల సంస్థలు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలివెళుతున్నాయనే నిరాధార కథనాన్ని ప్రచురించింది. నిజానికి అది పూర్తి అవాస్తవం. సరిగ్గా నెల తిరుగకముందే.. తెలంగాణలో పరిస్థితులు సానుకూలంగా లేవంటూ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు పంపేలా మరో నిరాధార కథనాన్ని ప్రచురించింది. ఇలా రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే అనేక కథనాలను ఎకనామిక్ టైమ్స్ ప్రచురిస్తూనే ఉంది. గత మూడేళ్లుగా హైదరాబాద్ లోని ఎకనామిక్ టైమ్స్ బ్యూరో చీఫ్ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా వరుస కథనాలు రాస్తూనే ఉన్నారు. ఎప్పుడైనా ఎవరైనా పెద్ద ఇన్వెస్టర్ తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తే ఆ కార్యక్రమానికి ఎకనామిక్ టైమ్స్ బ్యూరో చీఫ్ హాజరుకారు. ఇన్వెస్టర్ల ముందు తెలంగాణను అపహాస్యం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక ధోరణి కనిపిస్తోంది`` అని మండిపడ్డారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/