Begin typing your search above and press return to search.
కేటీఆర్ మాట..వారసత్వం ఈజీ కానేకాదు
By: Tupaki Desk | 10 Feb 2018 9:55 AM ISTదేశవ్యాప్తంగా సుపరిచితం తెలుగు రాష్ర్ట్లాల రాజకీయాల్లో సర్వసాధారణం అయిపోయిన వారసత్వ రాజకీయాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - రాష్ట్ర ఐటీ - పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికరమై విశ్లేషణ చేశారు. అందరూ అనుకుంటున్నట్లు..ఆయనకేంటి ముఖ్యమంత్రి కుమారుడు..ఫలాన ప్రముఖుడి తనయుడు...వగైరా అంశాలతో నెట్టుకురావడం అంత ఈజీ కాదన్నారు. రాజకీయాల్లో అయినా, వ్యాపారంలో అయినా వారసత్వాన్ని నిలబెట్టుకోవడం అంత సులభం కాదని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వారసత్వంతో వచ్చినవారికి కాస్త అవకాశం ఉంటుందని, అయితే అది ఎంట్రీలెవల్ వరకే పనికొస్తుందని చెప్పారు.
హెచ్ ఐసీసీలో ప్రారంభమైన క్రెడాయ్ యూత్ కాన్-2018లో మంత్రి కేటీఆర్.. జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా - కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తో కలిసి పాల్గొన్నారు. యువత ఎదుర్కొంటున్న పరిస్థితులపై రూపొందించిన ద యూత్ బారోమీటర్ నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వారసత్వంతో వచ్చే వారికి ఇతరులకంటే ప్రత్యేకత ఉంటుందని, శత్రువులు కూడా బయటికి గౌరవించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కానీ, దానివల్ల ఎంతోకాలం నిలబడలేమని విశ్లేషించారు. ప్రత్యేకతను చాటుకొంటేనే విజయం సాధిస్తామని చెప్పారు. విజయం సాధించాలనే మొదటితరంలో ఉన్న కాంక్షను ప్రస్తుత తరం అందిపుచ్చుకోవాలన్నారు. ప్రత్యేకత చాటుకోవాలని, సొంత ముద్ర వేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
కాగా, తన తండ్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన తీరును మరోమారు ఈ సందర్భంగా కేటీఆర్ వివరించారు. రాజకీయాల కంటే కూడా ఎకనామిక్స్ ముఖ్యమని - ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎకనామిక్స్ భవిష్యత్తును బంగారుమయం చేస్తుందని - సంపద - ఉద్యోగాలు సృష్టించి సంక్షేమాన్ని చేరువ చేస్తుందని పేర్కొన్నారు. నిర్మాణరంగంలో ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవాలని, కష్టపడిపనిచేసే తత్వానికితోడు.. సాంకేతికతను - ఆధునిక విధానాలను పాటిస్తూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం యూనిక్ అని, టీఎస్ ఐపాస్ - టీహబ్ వంటివి ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు.