Begin typing your search above and press return to search.
ఎగతాళి చేసే వారికి షాకిచ్చేలా కేటీఆర్ కుమారుడు
By: Tupaki Desk | 15 Dec 2021 8:47 AM ISTసకుటుంబ సమేతంగా తమిళనాడు టూర్ కు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి వెళ్లటం.. ఆయనతో భేటీ కావటం తెలిసిందే. స్టాలిన్ నివాసానికి వెళ్లిన వేళ.. తన కుటుంబ సభ్యులందరిని వెంట తీసుకెళ్లిన కేసీఆర్.. ఆ సందర్భంగా రెండు కుటుంబాల వారు కలిసి గ్రూపు ఫోటో దిగటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ గ్రూపు ఫోటోలో అందరిని ఆకర్షిస్తోంది సీఎం కేసీఆర్ ముద్దుల మనమడు హిమాన్షు మేకోవర్.
హిమాన్షు అన్నంతనే బొద్దుగా ఉండే రూపం గుర్తుకు వస్తుంది. చిన్నప్పటికి నుంచి చబ్బీగా ఉండే హిమాన్షుపై కొందరు చేసిన ఎగతాళి వ్యాఖ్యల్ని చూసినప్పుడు భాద పడేలా చేస్తుంది. లావు.. సన్నం అన్న దానికి చాలానే కారణాలు ఉంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొందరు బొద్దుగా కనిపిస్తారు. అలా అని.. బొద్దుతనానికి వారే బాధ్యులని చెప్పటానికి లేదు.
తన కుమారుడి బొద్దుతనంపై కొందరు చేసే వ్యాఖ్యలపైన ఆ మధ్యన మంత్రి కేటీఆర్ స్పందించటం.. ఆవేదన వ్యక్తం చేయటం తెలిసిందే. చిన్న పిల్లల్ని లక్ష్యంగా చేసుకోవటం తగదన్న మాట ఆయన నోటి నుంచి రావటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా హిమాన్షును చూస్తే.. అలాంటి ఎగతాళ నోళ్లకు మూత పడేలా మారాడు. ఇప్పుడు అతగాడు.. ఆరడుగుల ఎత్తును దాటేసినట్లుగా కనిపించారు.
అంతేకాదు.. గతానికి భిన్నంగా వెయిట్ బాగా తగ్గినట్లుగా కనిపిస్తోంది.
గడిచిన కొద్దికాలంగా మీడియాకు కనిపించని హిమాన్షు.. తాజాగా మాత్రం తమిళనాడు టూర్ లో గ్రూపు ఫోటోకు ఫోజు ఇచ్చిన వేళ.. అక్కడున్న వారందరి కంటే హైట్ గా ఉండటమే కాదు.. అరడుగుల బుల్లెట్ అన్న మాటకు సరిగ్గా సూట్ అయ్యేలా ఉన్నారు. ఏమైనా.. తాజా మేకోవర్.. హిమాన్షు అనవసరంగా నోరు పారేసుకునే వారికి ఆయన దిమ్మ తిరిగేలా షాకిచ్చారని చెప్పక తప్పదు. ఏమైనా.. హిమాన్షు మేకోవర్.. అందరూ మాట్లాడుకునేలా మారిందని మాత్రం చెప్పక తప్పదు.