Begin typing your search above and press return to search.

సిరిసిల్ల మంట‌ల‌ను భ‌లే ఆర్పేశావ్ కేటీఆర్‌

By:  Tupaki Desk   |   2 Aug 2017 10:15 PM IST
సిరిసిల్ల మంట‌ల‌ను భ‌లే ఆర్పేశావ్ కేటీఆర్‌
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్‌కు ఉన్న మాట‌ల నైపుణ్యం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అడ్డ‌గుట్ట‌లోని సామాన్యుల‌తో ఎలా మాట్లాడుతారో...అమెరికాలోని సాఫ్ట్‌వేర్ ఇండ‌స్ట్రీల పెద్ద‌ల‌తో అదే రీతిలో అల‌వోక‌గా మాట్లాడ‌గ‌ల‌రు. మ‌రోవైపు ఇటీవ‌ల ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న సిరిసిల్లా నియోజ‌క‌వ‌ర్గంలో ద‌ళితులు, ఇసుక మాఫియా విష‌యంలో ర‌చ్చ రచ్చ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ పార్టీ ఈ అంశం కేంద్రంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చేసింది. ఈ ప‌రిణామం ఒక్క కేటీఆర్‌కే కాదు అధికార టీఆర్ఎస్ పార్టీకి క‌ల‌క‌లం రేకెత్తించింది.

ఈ నేప‌థ్యంలో కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి రాజ‌న్న‌సిరిసిల్లా జిల్లాలోని వీర్న‌ప‌ల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు. పంచాయ‌తీ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన మంత్రి కేటీఆర్ ఈ సంద‌ర్భంగా మాట్లాడారు. మీ ద‌యతోనే మంత్రిన‌య్యాను.. మీ రుణం ఎలాగైనా తీర్చుకుంటాను అని తెలిపారు. రాజ‌కీయాల‌కు అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. వీర్న‌ప‌ల్లి మండ‌లాన్ని రూ. 15 కోట్ల‌తో అభివృద్ధి చేసిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. ద‌శాబ్ద కాలంగా అభివృద్ధికి ఆమ‌డ‌దూరంలో ఉన్న వీర్న‌ప‌ల్లిని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. వ‌చ్చే ఎండాకాలం నాటికి మిష‌న్ భ‌గీర‌థ ప‌నులు పూర్త‌వుతాయ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. రైతును రాజుగా చేయాల‌న్న ల‌క్ష్యంతో సీఎం కేసీఆర్ వ‌చ్చే యాసంగి నుంచి రెండు పంట‌ల‌కు రూ. 8 వేల పెట్ట‌బ‌డి ఇస్తున్న‌ట్లు తెలియ‌జేశారు. వ‌చ్చే జూన్ నాటికి కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్త‌వుతుంద‌ని.. రైతులు ఆటోమెటిక్ స్టార్ట‌ర్లు తీసేయాల‌ని ఆయ‌న కోరారు.

మ‌రోవైపు హైద‌రాబాదు న‌గ‌రం చుట్టుప‌క్క‌నే ఉన్న ఎకో ఫ్రెండ్లీ పార్కుల గురించి కేటీఆర్ వ‌రుస ట్వీట్లు చేశారు. మృగ‌వాణి నేష‌న‌ల్ పార్క్, బాగ్య‌న‌గ‌ర్ నంద‌న‌వ‌న‌మ్‌, కండ్ల‌కోయా పార్క్‌, సంజీవ‌ని పార్క్‌.. ఇవ‌న్నీ వీకెండ్స్‌లో ఉల్లాసంగా గ‌డిపేందుకు స‌రైన వేదిక‌లు అని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జెప్పారు.