Begin typing your search above and press return to search.

జగన్ గురించి కేటీర్ షాకింగ్ కామెంట్స్...?

By:  Tupaki Desk   |   21 Sept 2022 2:43 PM IST
జగన్ గురించి కేటీర్ షాకింగ్ కామెంట్స్...?
X
ఏపీ సీఎం జగన్ని సాటి తెలుగు రాష్ట్రం తెలంగాణా నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. జగన్ మంచి పాలనను ఏపీకి అందిస్తున్నారంటూ తెలంగాణా మంత్రి, టీయారెస్ భావి నాయకుడు కేటీయార్ కితాబులు ఇవ్వడం ఇపుడు చర్చనీయాశంగా ఉంది. నిజానికి అప్పట్లో అంటే కొద్ది నెలల క్రితం ఇదే కేటీయార్ పొరురు రాష్ట్రంలో రోడ్లు బాగాలేవు, కరెంట్ లేదు, సంక్రాంతికి అటు వెళ్ళిన తన స్నేహితులు చెప్పారంటూ ఒక కీలక సమావేసంలోనే ఇండైరెక్ట్ గా జగన్ మీద తీవ్ర విమర్శలు చేశారు.

దాని మీద రచ్చ అలా ఇలా జరగలేదు. ఆ తరువాత కేటీయార్ తాను ఎవరినీ ఉద్దేశించి అనలేదని వివరణ ఇచ్చుకున్నారు. అది వేరే సంగతి, ఇక చూస్తే ఇపుడు అదే కేటీయార్ నోటి నుంచి ఆణిముత్యాల లాంటి మాటలు జగన్ గురించి రావడం విశేషం. ఇంతకీ కేటీయార్ హిందూ పత్రిక సంపాదకీయ బృందంతో తాజాగా మాట్లాడుతూ ఏమన్నారు అంటే జగన్ సమర్ధ పాలకుడని. ఆయన ఏపీని చక్కగా పాలిస్తున్నారని అంటున్నారు.

అంతే కాదు కరోనా వంటి సంక్లిష్ట పరిస్థితుల్లో జగన్ పాలనా తీరు చాలా బాగుందని కేటీయార్ గుర్తు చేస్తున్నారు. జగన్ అక్కడ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల వ్యవధిలోనే కరోనా వచ్చిందని, అయినా జగన్ అత్యంత కష్టమైన ఆ సమయంలో కూడా బాగా పాలించారని పేర్కొనడమే ఇక్కడ విశేషం. అప్పట్లో ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తినా జగన్ పేదలకు సంక్షేమ పధకాలను అందించడంతో సఫలీకృతులు అయ్యారని చెప్పడం విశేషం. కరోనా వంటి దుర్బర పరిస్థితులను జగన్ చాలా ధైర్యంగా ఎదుర్కొన్నారని కేటీయార్ కీర్తించారు.

ఇక ఏపీలో జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పధకాల వల్ల అక్కడ ఆర్ధిక వ్యవస్థ నాశనం అయిందన్న ఆరోపణలను కేటీయార్ తోసిపుచ్చారు. అవన్నీ విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అంటున్నవే అని తేలిగ్గా తీసేసారు. నిజానికి ఏపీ ఖజనా ఉత్తరప్రదేశ్ ఖజానా కంటే పటిష్టంగా ఉందని కేటీయార్ బీజేపీ రాష్ట్రంతో పోలిక పెట్టి మరీ చెప్పడం ఇక్కడ గమనార్హం.

తన సోదర సమానుడైన జగన్ ఏలుబడిలో ఏపీలో చక్కని పాలన సాగుతోందని కేటీయార్ అనడం కొసమెరుపు. మొత్తానికి చూస్తే కేటీయార్ జగన్ని పనిగట్టుకుని ఒక జాతీయ పత్రిక ఇంటర్వ్యూలో పొగడం అంటే దీని మీద రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది. నిజానికి టీయారెస్ వైసీపీల మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయని అంతా అంటారు. అయితే ఎవరూ బయటపడరు, జగన్ ఇబ్బందులు తెలిసే కేసీయార్ కూడా ఏపీ వైపు తొంగి చూడడంలేదు అని కూడా చెబుతారు.

ఇపుడు కేటీయార్ జగన్ని తన సోదరుడు ఏపీని చక్కగా పాలిస్తున్నాడు అని చెప్పడం ద్వారా వైసీపీ తో దోస్తీ బహు గట్టిది అని చెప్పుకున్నారు అన్న మాట. రాబోయే రోజుల్లో కేసీయార్ జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. ఆయనకు సాటి తెలుగు రాష్ట్రం నుంచి మద్దతు రావాల్సి ఉంది. జగన్ అయితే ఈ సమయంలో డైరెక్ట్ గా మద్దతు అని చెప్పలేరు. అయితే జగన్ ఎపుడైనా కేసీయార్ తోనే ఉంటారన్న ప్రచారాం ఉంది.

మరి ఇవన్నీ ఇలా ఉంటే జాతీయ పత్రికలో టీయారెస్ కీలక నేత, కేసీయార్ కుమారుడు అయిన కేటీయార్ జగన్ని పొగడడం అంటే ఫక్తు పాలిటిక్స్ ఉందనే చెబుతున్నారు. మరి ఈ వార్తలను బీజేపీ ఏ విధంగా అర్ధం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.