Begin typing your search above and press return to search.
సోనియాను అంత మాట అనేసిన కేటీఆర్!
By: Tupaki Desk | 30 Jun 2018 10:33 AM ISTఅందుకే అనేది రాజకీయాలు మహా కరకుగా ఉంటాయని. సున్నిత మనస్కులు ఈ రొచ్చులో ఇమడలేరని. గౌరవం.. మర్యాద అన్నది చాలా సందర్భాల్లో కనిపించవు. రాజకీయ ప్రయోజనాలు తప్పించి మరింకేమీ కనిపించవు. ఎంత పిలిస్తే మాత్రం. సకుటుంబ సపరివార సమేతంగా విందుకు వెళ్లి.. సుష్టిగా భోజనం చేసి.. ఫోటోలు దిగి మరీ బయటకు వచ్చిన కేసీఆర్ ప్యామిలీని తెలంగాణ సమాజం మర్చిపోదుగా.
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం కనిపించిన ఈ దృశ్యం.. చాలామంది తెలంగాణవాదుల మనసుల్లో నుంచి ఇంకా తొలిగిపోలేదు. ఆ రోజు భోజనం చేసి వచ్చిన తర్వాత.. తెలంగాణ ఇచ్చిన అమ్మగా సోనియాను అభివర్ణించిన మాటలు.. ఆమెకు థ్యాంక్స్ చెప్పిన వైనాన్ని మర్చిపోలేరు. మరి.. ఎంత పాడు రాజకీయం అయితే మాత్రం.. మైలేజీ కోసం.. అధిక్యత కోసం అన్నేసి మాటలు అనాలా? అన్నది ప్రశ్న. మాటలతో అందరిని మెస్మరైజ్ చేసే టాలెంట్ ఇస్తే మాత్రం.. అదే పనిగా నోరు పారేసుకోవటం మంచిదేనా? అన్నది మరో సందేహం ఇప్పుడు పలువురిని వేధిస్తోంది.
తాజాగా కొందరుపార్టీలో చేరుతున్న సందర్భంలో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఎవరు అవునన్నా.. కాదన్నా.. సోనియాగాంధీ పట్టుబట్టకుంటే తెలంగాణ సాధ్యం కాదన్నది మర్చిపోలేం. ఈ రోజు తెలంగాణలో ఒక సభ పెట్టుకోవాలంటేనే సాధ్యం కాని పరిస్థితి. తన రాజకీయ ప్రత్యర్థుల విషయంలో కేసీఆర్ సర్కారు ఎంత కఠినంగా ఉంటుందన్నది నాలుగేళ్ల వ్యవధిలో అందరికి అర్థమయ్యే పరిస్థితి.
పవర్లో ఉన్నప్పుడు సంక్రమించే అధికార బలంతో తమకు తోచినట్లుగా కేసీఆర్ సర్కారు చేస్తున్న వేళ.. ఎవరూ వారిని అడ్డుకోలేకపోతున్నారు. మరి.. కేంద్రంలో కీలకంగా వ్యవహరించిన సోనియా కానీ ఏది ఏమైనా.. ఎంత నష్టం జరిగినా సరే.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చేది లేదని తెగేసి చెబితే.. ఏం జరిగేది? అన్న ప్రశ్న వేసుకుంటే.. సమాధానం ఎవరికి వారికి వచ్చేస్తుంది.
అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ కీలకంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. అయితే.. ఆమె నిర్ణయం తీసుకోవటానికి కేసీఆర్ ఒత్తిడి.. ఉద్యమ తీవ్రత ప్రభావం చూపించిందన్నది నూటికి నూరుశాతం నిజం. ఈ వాస్తవం తెలంగాణ ప్రజలకు మాత్రమే కాదు.. తెలుగు ప్రజలందరికి బాగా తెలుసు. అయినప్పటికీ అందుకు భిన్నమైన వాదనను వినిపించటం.. వాస్తవాన్ని మసిపూసేలా తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడటం ఎంతవరకు సమంజసం అన్నది ప్రశ్నగా మారింది.
తెలంగాణను ఇవ్వటంలో కేసీఆర్ కృషిని ఎలా కాదనలేరో.. సోనియాగాంధీ కానీ లేకుంటే ఎప్పటికీ ఆ కల తీరేది కాదన్న మాటను తెలంగాణలోని ప్రతిఒక్కరూ పార్టీలకు అతీతంగా ఒప్పుసేకునే మాట. అలాంటి విషయంలోనూ మంత్రి కేటీఆర్ తొందరపడటం అంత మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఇచ్చింది అమ్మా కాదు.. బొమ్మా కాదు.. ప్రజలు కొట్లాడి గుంజుకుంటేనే తెలంగాణ వచ్చింది.. రాష్ట్రం ఇవ్వకపోతే ప్రజలు తంతారన్న భయంతోనే విధిలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చిందంటూ కేటీఆర్ విరుచుకుపడిన వైనం చూసినప్పుడు.. ఆయన తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేశారన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తండ్రి అడుగుజాడల్లో నడవటం తప్పించి తనదైన మార్క్‌ను కేటీఆర్ ఎప్పుడూ ప్రదర్శించలేదు. ఆ మాటకు వస్తే.. కేటీఆర్ తో పోలిస్తే.. కవిత తనదైన వేదికను పెట్టుకొని తెలంగాణ సమాజాన్ని జాగృతి చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ తో పోలిస్తే.. హరీశ్ రావు వ్యూహాలే ఎక్కువన్నది కాదనలేని నిజం.
అలాంటప్పుడు తెలంగాణ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన సోనియాను ఉద్దేశించి అంతేసి మాటను పుసుక్కున కేటీఆర్ లాంటి వారి నోటి నుంచి రావటం అంటే.. ఆరోగ్యకర రాజకీయాలకు అదేమాత్రం మంచిది కాదన్న మాట బలంగా వినిపిస్తోంది. ఎన్నికలు దగ్గరకు వస్తున్నవేళ..తెలంగాణ రాష్ట్ర సాధన క్రెడిట్ తమ ఖాతాలోనే మొత్తంగా వేసుకోవాలన్న కేటీఆర్ తాపత్రయం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలాంటి ఆత్రుత మంచిదే కాదు.. మోతాదు మించిదే మొదటికే మోసం వస్తుందన్నది కేసీఆర్ కుమారుడు గుర్తుంచుకుంటే మంచిది. లేదంటే.. భంగపాటు తప్పదని చెప్పక తప్పదు.