Begin typing your search above and press return to search.
పోటీకి జేజమ్మ జంకుతున్నారు: కేటీఆర్
By: Tupaki Desk | 9 March 2019 4:40 PM ISTకాంగ్రెస్ లో డీకే అరుణను జేజమ్మగా పిలుస్తుంటారు.గద్వాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే అరుణ కాంగ్రెస్ లో వెలుగు వెలిగారు. తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అన్నారు.. కానీ ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారు. తాజాగా నాగర్ కర్నూర్ లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణపై హాట్ కామెంట్ చేశారు. మాజీ మంత్రి, గద్వాల మాజీ ఎమ్మెల్సే డీకే అరుణ పాలమూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు జంకుతున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి గతం ఎంతో వైభోగమని, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీపడేవారని కానీ ప్రస్తుతం అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. పాలమూరు ఎంపీ స్థానానికి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఎంతో పోటీ ఉండేదని నేడు డీకే అరుణ సైతం ఎంపీగా పోటీ చేసేందుకు వెనుకంజ వేస్తున్నారని కామెంట్ చేశారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు ఇక్కడ నల్లేరుపై నడకే అని అర్థమవుతుందని స్పష్టం చేశారు.
దక్షిణాదిలో బీజేపీ పార్టీకి ఉనికే లేదని అలాంటప్పుడు ఆ పార్టీ జాతీయ పార్టీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ అధికారంలో రావడం కష్టమని సర్వేలు చెబుతున్నాయని అన్నారు. ఒకవేళ 70 నుంచి 80 పార్లమెంట్ స్థానాలు ఫెడరల్ ఫ్రంట్ సాధిస్తే ఢిల్లీ గద్దెపై ఎవరినీ కూర్చోబెట్టాల్లో మన చేతుల్లోనే ఉంటుందని ఓటర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఏదిఏమైనా ఈసారి నాగర్ కర్నూల్ లో కారు జోరు తప్పదని అన్నారు. పార్టీలోకి ఎవరు వచ్చినా కలుపుకుపోవాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనిపై జేజమ్మ ఎలా స్పందిస్తారో చూడాలి మరీ..