Begin typing your search above and press return to search.

రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తోంది: కేటీఆర్

By:  Tupaki Desk   |   27 Nov 2020 3:00 PM IST
రోహింగ్యాలు ఉంటే కేంద్రం ఏం చేస్తోంది: కేటీఆర్
X
గ్రేటర్ ప్రచారంలో బీజేపీ ఎత్తులకు బీజేపీ పైఎత్తులు వేస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ-టీఆర్ఎస్ నేతల మధ్య వార్ పీక్స్ కు చేరుతోంది.

తాజాగా రోహింగ్యాల చుట్టూ రాజకీయ వివాదం చెలరేగుతోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉన్నారని అనడం దుమారం రేపింది. దీనిపై తాజాగా కేటీఆర్ కూడా కౌంటర్ ఇవ్వడంతో హీట్ పెరిగింది.

హైదరాబాద్ లో రోహింగ్యాలు ఉంటే గత ఆరేళ్లుగా ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తోందని కేటీఆర్ ప్రశ్నించారు. రోహింగ్యాలు ఆధార్, ఓటరు కార్డులు తీసుకుంటుంటే హోం రక్షణ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గ్రేటర్ లో నాలుగు ఓట్ల కోసం బీజేపీ ఇలా హైదరాబాద్ లో చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఇది దేశానికే మంచిది కాదన్నారు.

గల్లీ ఎన్నికల కోసం ఢిల్లీ నుంచి టూరిస్టులు వస్తున్నారని బీజేపీ ప్రచారంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏకంగా 12మంది కేంద్రమంత్రులు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. మోడీ కూడా వస్తారట.. ఉచిత వ్యాక్సిన్ ఇస్తాడట అని పేర్కొన్నారు. ఖాళీగా ఉంటే డొనాల్డ్ ట్రంప్ ను తీసుకొస్తారేమో అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఎవరొచ్చినా తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెప్పి వెళ్లాలని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామిగా ఉన్నందుకు భారతీయులుగా గర్వపడుతున్నామన్నారు. అయితే కేంద్రమే తెలంగాణకు డబ్బులు ఇచ్చిందనే ఫొజులు కొట్టొద్దని, ప్రజలు నమ్మేస్థితిలో లేరని చెప్పారు.