Begin typing your search above and press return to search.

అమెరికా కొత్త ఉపాధ్యక్షుడితో కేటీఆర్..

By:  Tupaki Desk   |   9 Nov 2016 5:02 PM IST
అమెరికా కొత్త ఉపాధ్యక్షుడితో కేటీఆర్..
X
అమెరికా ఎన్నికల ఫలితాల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రభంజనంలో కీలక పాత్రధారి - ట్రంప్ సహచరుడు - అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు అయిన మైక్ పేన్స్ తో తెలంగాణ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారాకరామారావు తో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది మే చివరి వారంలో మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ పలు రాష్ట్రాల్లో ఆయన పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా మే 25-26 తేదీల్లో ఇండియానా గవర్నర్ మైక్ పేన్స్ ను కలుసుకున్నారు. అయితే మైక్ పేన్స్ తాజా ఎన్నికల ఫలితాల సంబరాల్లో ఉండగా... నాటి సమావేశానికి సంబంధించిన ఫొటోలను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో రీపోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా కాబోయే అధ్యక్షుడు ట్రంప్ కు - ఉపాధ్యక్షుడు మైక్ పేన్స్ కు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. "ప్రపంచమంతా కొన్ని గంటలుగా ఉత్సుకతతో ఊగిపోతోంది. అమెరికాలో ట్రంప్ థండర్.. ఇండియాలో మోడీ సంచలన నిర్ణయం.. ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపర్చింది. మున్ముందు ఇలాంటి స్వీట్ షాక్ లు తప్పక చవిచూడాల్సి ఉంటుంది" అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభినందనలతోపాటు... ట్రంప్ - మైక్ పేన్స్ విజయంతో అమెరికా - భారత్ ల బంధం మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/