Begin typing your search above and press return to search.

ల‌గ‌డ‌పాటి జోక్‌... తెలంగాణ‌లో పేల‌దు

By:  Tupaki Desk   |   2 Dec 2018 5:27 PM IST
ల‌గ‌డ‌పాటి జోక్‌... తెలంగాణ‌లో పేల‌దు
X
ప్రస్తుత రాజ‌కీయ నాయ‌కుల్లో ఆన్‌ లైన్లో సినిమా వాళ్ల‌కు మించిన ఆద‌ర‌ణ ఉన్న వ్య‌క్తి కేటీఆర్‌. మిగ‌తా వాళ్లు కొంద‌రు ఆన్‌ లైన్లో యాక్టివ్‌ గా ఉన్నా... టోట‌ల్ స్కోర్ మాత్రం కేటీఆర్‌ దే. స‌మాధానం చెప్ప‌డ‌మూ వ‌చ్చు - స్వంతంగా దానిని మెయింటెయిన్ చేయ‌డ‌మూ వ‌చ్చు. ఎక్కువ కాలం ఐటీలో ప‌నిచేయ‌డ‌మే దీనికి కార‌ణం కావ‌చ్చు. అయితే, త‌న ఫాలోయ‌ర్ల‌తో ఇత‌ర నెటిజ‌న్ల‌తో మాట్లాడ‌టానికి ఈరోజు మ‌ధ్యాహ్నం కేటీఆర్ *ఆస్క్ కేటీఆర్‌* అనే ఒక ఇంట‌రాక్ష‌న్ ప్రోగ్రాం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌తో మాట్లాడారు. చాలామందికి ఆయ‌న సమాధానం చెప్పారు. కొంద‌రు స‌రదాగా - ఇంకొంద‌రు సీరియ‌స్‌ గా డిస్క‌ష‌న్ పెట్టారు.

ఈ సంద‌ర్భంగా ఒక నెటిజ‌న్ ల‌గ‌డ‌పాటి స‌ర్వేను ప్ర‌స్తావించారు. దీనిపై కేటీఆర్ త‌న‌దైన శైలిలో స్పందించారు. అత‌ని ట్రిక్‌ లు తెలంగాణ‌ను ఆప‌డానికి పార్ల‌మెంటులో ప్లే చేశారు. అవేమీ తెలంగాణ‌ను ఆప‌లేదు. ఇపుడు మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో ప్లే చేస్తున్నాడు. అవి కూడా తెలంగాణ అభివృద్ధిని న‌డిపే స‌ర్కారు విజ‌యాన్ని ఆప‌లేవు అన్నారు. మొన్న కేసీఆర్ కూడా ల‌గ‌డ‌పాటి స‌ర్వేల‌పై స్పందించారు. ఇక్క‌డ మ‌కిలి వెకిలి స‌ర్వేలు న‌డ‌వ‌వు అని వ్యాఖ్యానించారు.

ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాంలో మ‌రో నెటిజ‌న్ హ్యాపీ బ‌ర్త్ డే చెప్ప‌మ‌ని అడిగి మ‌రీ చెప్పించుకోగా .. ఇంకో నెటిజ‌న్ మీకు నార్త్ ఇండియ‌న్ ప‌ప్పు ఇష్ట‌మా? సౌత్ ఇండియ‌న్ ప‌ప్పు ఇష్ట‌మా ? అని అడ‌గ్గా... నో కామెంట్స్ అని రిప్ల‌యి ఇచ్చారు కేటీఆర్‌.