Begin typing your search above and press return to search.
ఎగ్జిట్ పోల్స్ ఊరిస్తున్నా..ఒద్దికగా మాట్లాడిన కేటీఆర్
By: Tupaki Desk | 22 Oct 2019 10:10 AM ISTయాక్సిడెంట్ అంచుల్లోకి వెళ్లి.. ఆఖరి క్షణంలో సేఫ్ గా బయటపడినప్పుడు ఎలాంటి మైండ్ సెట్ ఉంటుంది? ఇంచుమించు ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ తోనే ఉన్నారు టీఆర్ఎస్ నేతలు. ఎదురుదెబ్బ ఖాయమని దాదాపుగా కన్ఫర్మ్ అయిపోవటమే కాదు.. తాజాగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మె తమ పార్టీకి చేసే చేటు అంతా ఇంతా కాదన్నట్లుగా ఫీలైన దానికి భిన్నంగా హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ అధికారపక్షానికి అనువుగా మారుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
ఇలాంటివేళ రెట్టించిన ఉత్సాహంతో విపక్షాల మీద విరుచుకుపడే తీరుకు భిన్నంగా వ్యవహరించి ఆశ్చర్యకరంగా మారారు కేటీఆర్. హుజూర్ నగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కమ్ మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తన సహజమైన దూకుడుకు భిన్నంగా ఆయన మాటలు ఉండటం గమనార్హం. పోలింగ్ ముగిసిన తర్వాత ట్విట్టర్ వేదికగా చేసుకొని స్పందించిన ఆయన.. ఆచితూచి అన్నట్లుగా.. ఎక్కడా ఈగో కనిపించనిరీతిలో ఆయన ట్వీట్ ఉందని చెప్పాలి.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ గౌరవప్రదమైన మెజార్టీతో విజయాన్ని సాధిస్తుందన్న విషయాన్ని వెల్లడించారు. పోలింగ్ ముగిసిన వెంటనే స్పందించిన ఆయన.. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా గెలుపు ఖాయమన్న సంకేతాన్ని ఇవ్వటంతో పాటు.. మెజార్టీ కూడా బాగుంటుందన్న విషయాన్ని చెప్పేశారు.
అహాన్ని ప్రదర్శించిన తర్వాత మెజార్టీ అనుకున్నంత రాని పక్షంలో గెలిచిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. విపక్షాలు తాము చెప్పిన మాటల్ని తమకే అప్పజెప్పే వీలుందన్న ఉద్దేశంతో ముందుస్తు జాగ్రత్తతో తామున్న విషయాన్ని తాజాగా చేసిన ట్వీట్ తో చెప్పేశారని చెప్పాలి. విజయం ఖరారైన తర్వాత ఒద్దికతో మాట్లాడటం ద్వారా.. ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదన్నది కేటీఆర్ ఆలోచనగా చెబుతున్నారు.