Begin typing your search above and press return to search.
బాబు సెంటిమెంట్ మాటకు కేటీఆర్ ట్వీట్ పంచ్!
By: Tupaki Desk | 14 March 2018 1:07 PM ISTగడిచిన మూడు నాలుగు రోజులుగా ఏపీ ప్రత్యేక హోదా అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు తెలిసిందే. కేంద్రంలోని మోడీ సర్కారును ఉద్దేశించి ఆయన ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. సెంటిమెంట్ తో హోదా ఇవ్వలేమంటూ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాటను ప్రస్తావిస్తూ.. సెంటిమెంట్ తోనే తెలంగాణ ఇచ్చారంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యపై తాజాగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. బాబు చేసిన సెంటిమెంట్ వ్యాఖ్య ఆయనకు అస్సలు నచ్చనట్లుంది. బాబు మాటలో ఆయనకేం తప్పు కనిపించిందో కాదు.. సెంటిమెంట్ మాటపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ తాజాగా చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
మీ రాష్ట్ర హక్కుల కోసం పోరాడటంలో తప్పు లేదు. కానీ.. తెలంగాణ ప్రజల పోరాటాన్ని.. త్యాగాలను తక్కువ చేసి మాట్లాడొద్దు.. మేం ప్యాకేజీల కోసం రాష్ట్రాన్ని కోరుకోలేదు.. అది మా హక్కు అంటూ కౌంటర్ ఇచ్చారు. బాబు చేసిన సెంటిమెంట్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఈ స్థాయిలో ట్వీట్ చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అన్నది ఎంత హక్కో.. ఆంధ్రోళ్లకు ఏ మాత్రం ఇష్టం లేకుండా జరిగిన విభజన సమయంలో ఏపీకి హోదా ఇస్తామంటూ ప్రకటించిన చేతులెత్తేయటం.. సెంటిమెంట్ ఉందని హోదా ఇవ్వలేమంటూ జైట్లీ వ్యాఖ్యానించటం తెలిసిందే.
తెలంగాణ కోసం పెద్ద ఎత్తున పోరాటం జరిగినా.. అది ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్నా.. ప్రజల్లో నిండుగా ఉన్న సెంటిమెంట్ ను గౌరవించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలని నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా నిర్ణయించిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైంది. అలాంటప్పుడు తెలంగాణలో సెంటిమెంట్ బలంగా ఉండటం వల్లే రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందన్న మాటలో కేటీఆర్ కు అంత తప్పేం కనిపించిందన్న ప్రశ్న పలువురు వ్యక్తం చేస్తున్నారు.