Begin typing your search above and press return to search.
ఫర్లేదు.. ఎన్టీఆర్ ను మర్చిపోలేదే కేటీఆర్!
By: Tupaki Desk | 29 Oct 2018 1:00 PM ISTకొందరిని కొన్ని చట్రాల్లోకి అస్సలు తీసుకురాకూడదు. కానీ.. ఆ పని చేసి భారీ రాజకీయ ప్రయోజనాన్ని పొందిన అధినేతగా కేసీఆర్‌ను చెప్పక తప్పదు. ఆ మాటకు వస్తే.. తమ తమ రాజకీయాల కోసం విభజనవాదాన్ని ఎప్పటికప్పుడు ఒక అస్త్రంగా వాడుకొని రాజకీయ లబ్థి పొందిన పార్టీలకు షాకిచ్చేలా కేసీఆర్ వ్యవహరించిన తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదు.
ఎవరికి వారు.. ప్రత్యేక తెలంగాణ కలను వాడేస్తుంటే.. తాను సైతం తనదైన శైలిలో వాడేసిన కేసీఆర్ తీరు కొందరికి నచ్చదు. తెలంగాణ వారి సంగతి పక్కన పెడితే.. రెండు రాష్ట్రాలుగా తెలుగోళ్లను చేసిన కేసీఆర్ అంటే చాలామంది సీమాంధ్రులకు కోపం. కానీ.. వారంతా మర్చిపోయే విషయం..తెలంగాణ సెంటిమెంట్ ను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడేస్తూ.. బంతాట ఆడుకున్నారని.
తెలంగాణ అంశాన్ని తెర మీదకు తెచ్చినప్పుడే ఆంధ్రోళ్లు కలుగజేసుకొని గట్టిగా రియాక్ట్ అయి ఉంటే చరిత్ర మరోలా ఉండేది. రాజకీయ అధినేతల ఆటల్ని తెలిసో తెలియకో చూస్తూ ఉండిపోయిన సీమాంధ్రులకు భారీ శిక్ష తప్పలేదు. తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడటమే కాదు.. రెండు రాష్ట్రాల మధ్య పూడ్చలేని దూరాన్ని పెంచినట్లైంది.
ఇందుకు తగ్గట్లే.. విభజన తర్వాత కూడా విడిపోయి కలిసి ఉందామన్న నినాదాన్ని పక్కన పెట్టి.. ఎవరి రాజకీయం కోసం వారు గేమ్ ప్లాన్ సెట్ చేయటంతో మధ్య మధ్యలో అనవసరమైన ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి ఈ క్రమంలో నోటి దురుసుతనం ఎక్కువగా ఉండే కేసీఆర్.. సీమాంధ్రుల్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎవరినైనా సరే కడిగిపారేసే అలవాటున్న కేసీఆర్ అందరిని అన్నా.. ఎన్టీఆర్ ను ఏ రోజు పల్లెత్తు మాట అనలేదన్నది మర్చిపోకూడదు.
ప్రతి విషయంలో తనదైన రీతిలో తెలంగాణ పాయింట్ ను తెర మీదకు తీసుకొచ్చే కేసీఆర్.. సీమాంధ్రుల్ని ఒక్కరిని కూడా పొగిడింది లేదు. అందుకు ఎన్టీఆర్ మినహాయింపుగా చెప్పక తప్పదు. ప్రతి విషయంలోనూ తెలంగాణ వారు లేరా? అనేయటం.. ఆ పాటి మొనగాడితనం ఉన్న తెలంగాణ బిడ్డలు చాలామందే ఉన్నారనే కేసీఆర్.. ఎన్టీఆర్ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆయన మాట జారరు.
తండ్రికి తగ్గట్లే.. కేటీఆర్ సైతం అదే తీరును ప్రదర్శించారు. తెలుగోళ్లు అన్న మాటకు ఒప్పుకోని కేసీఆర్ తీరుకు కాస్త భిన్నంగా.. తెలుగువారికి గుర్తింపు తెచ్చి పెట్టింది తారక రామారావేనని వ్యాఖ్యానించటం విశేషం. ఎన్టీఆర్ కారణంగానే తెలుగు వారికి గుర్తింపు వచ్చింది.. అప్పటివరకూ మదరాసీలుగా పేరున్న తెలుగు వారిని.. తెలుగువారిగా గుర్తించారంటూ కేటీఆర్ చెప్పటం చూస్తే.. ఎన్టీఆర్ తో ఎవరిని పోల్చలేం. ఎవరిని ఆయనకు సమానమని చెప్పలేం. ఈ విషయంలో ఎన్టీఆర్ ఒకేఒక్కడని చెప్పక తప్పదు.