Begin typing your search above and press return to search.

యంగ్ డైనమిక్ కేటీఆర్ ను చూస్తే మైండ్ బ్లాకవుద్ది..

By:  Tupaki Desk   |   11 Dec 2021 3:04 PM IST
యంగ్ డైనమిక్ కేటీఆర్ ను చూస్తే మైండ్ బ్లాకవుద్ది..
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు... రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రాజకీయ నాయకుడిగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటూ ప్రజల మన్ననలను పొందుతున్నాడు. ఓ వైపు రాజకీయ నాయకుడిగా దూకుడు పెంచుతూనే మరోవైపు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో నిత్యం పర్యటనలు చేస్తూ అక్కడి ప్రజల బాగోగులు చూసుకుంటున్నారు.

ఇంకోవైపు దేశ విదేశాల ప్రతినిధులతో సమావేశమవుతూ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కు ఎంత ప్రాధాన్యత ఉందో అంతేస్థాయిలో కేటీఆర్ కు కుడా అభిమానులు ఉన్నారు.

1976 జూలై 24న జన్మించిన కేటీఆర్ తన విద్యాభ్యాసాన్నంతా వివిధ రాష్ట్రాల్లో కొనసాగించారు. ఆ తరువాత అమెరికాలోని సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో 1998-2000లో ఎంబీఏ పూర్తి చేశారు.

అనంతరం అమెరికాలోని ఇంట్రా ప్రైవేట్ కంపెనీలో ఐదేళ్లపాటు ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేశారు. ఆ తరువాత సొంత రాష్ట్రానికి వచ్చిన కేటీఆర్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో 2004 నుంచి కొనసాగారు. ఆ తరువాత కేసీఆర్ చేస్తున్న ఉద్యమాలకు పరోక్షంగా వెన్నంటి ఉన్నారు.

2008లో కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ తరువాత ఉప ఎన్నికల బరిలోకి దిగారు. ఆ సమయంలో సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ విస్తృతంగా పర్యటన చేసిన ప్రచారం చేశారు.

2009లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ప్రత్యర్తి కేకే మహేందర్ రెడ్డిపై కేవలం 171 ఓట్ల మెజారిటీ రావడంతో తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత 2010లో జరిగిన ఉప ఎన్నికలో 68వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి గెలుపొందారు.

కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు అమెరికాలో విస్తృతంగా పర్యటనలు చేశారు. మేధావులతో సమావేశమై అమితమైన మేధో సంపత్తిని పెంచుకున్నాడు. ఈ సందర్భంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో అలనాడు అమెరికాలో ఉన్న ఫొటోలను పెట్టాడు. దీంతో అవి వైరల్ గా మారాయి. ఇందులో కేటీఆర్ క్యూట్ గా... చిన్న పిల్లాడిలా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు ‘చాలా బాగున్నార్ సార్..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.