Begin typing your search above and press return to search.

కేటీఆర్ బాబూ అంటే, ప్రిన్స్ మాత్రం సర్ అన్నారు

By:  Tupaki Desk   |   12 Aug 2015 6:02 PM IST
కేటీఆర్ బాబూ అంటే, ప్రిన్స్ మాత్రం సర్ అన్నారు
X
తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటూ కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ (బాహుబలి కాదు) దూసుకెళుతున్న శ్రీమంతుడి చిత్రానికి మరో ప్రముఖుడి మనసు దోచుకుంది.

తాజాగా.. ఈ సినిమాను చూసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ శ్రీమంతుడు సినిమాను చూసి ట్విట్టర్ లో స్పందించారు. తమ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని ప్రారంభించనున్న సమయంలోనే గ్రామాభివృద్ధి అవసరాన్ని పేర్కొంటూ స్ఫూర్తిదాయకపమైన సినిమా రావటం బాగుందన్న సంతోషాన్ని వ్యక్తం చేసిన ఆయన.. మహేష్ బాబుకు తన అభినందనలు తెలిపారు.

ఈ సినిమాకు సంబంధించి ‘‘మంచి సినిమా మహేష్ బాబూ’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేయగా.. దానికి వెంటనే స్పందించిన ప్రిన్స్ మహేష్ బాబు మాత్రం వినమ్రతతో.. ‘‘థాంక్యూ కేటీఆర్ సర్’’ అంటూ తన ట్వీట్ తో రియాక్ట్ అయ్యారు. ఎంత సెలబ్రిటీలు అయినా.. ప్రోటోకాల్ లెక్కలు మర్చిపోరు కదా.