Begin typing your search above and press return to search.
తండ్రిని పొగిడే క్రమంలో బాబును పొగిడిన కేటీఆర్
By: Tupaki Desk | 7 July 2019 3:48 PM ISTటీడీపీ అధినేత చంద్రబాబును అవకాశం వచ్చిన ప్రతిసారీ విడిచిపెట్టకుండా విమర్శల వర్షం కురిపించే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుకు భిన్నంగా వ్యవహరించారా? అంటే అవునని చెప్పారు. తాజాగా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టే హడావుడిలో తనకు తెలీకుండానే బాబును పొగిడేశారని చెప్పాలి.
కింద పడినా పైచేయి తమదేనన్నట్లుగా వ్యవహరించే తీరు కేటీఆర్.. మోడీని తప్ప పట్టే క్రమంలో బాబును అనుకోకుండా పొగిడేశారని చెప్పాలి. ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ప్రయోజనాల్ని పట్టించుకోలేదన్న విమర్శను చేశారు. తామెన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తాము రూ.24వేల కోట్ల సిఫార్సులు ఇచ్చినా కేంద్రం రూ.24 కూడా కేటాయించలేదన్నారు. విభజన జరిగి ఐదేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ విభజన హామీల్ని అమలు చేయలేదని తప్పు పట్టారు.
తమ అధినేత గొప్పతనాన్ని కీర్తిస్తూ కేటీఆర్ పెట్టిన ట్వీట్లు బీజేపీ సూరత్ ఉపాధ్యక్షుడు శర్మ రియాక్ట్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలేనని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా రైతుబంధు.. మిషన్ భగీరథలను ప్రస్తావించారు. దీనికి శర్మ స్పందిస్తూ.. వాటర్ గ్రిడ్ పథకాన్ఇన అధ్యయనం చేసేందుకు మీరు గుజరాత్ సందర్శించిన విషయం వాస్తవం కాదా? వాటర్ గ్రిడ్.. సబర్మతి నదిలోకి నీళ్లను ఎత్తిపోసే నర్మదా కాలువను మీరు ప్రశంసించలేదా?.. మీరిప్పుడు చేపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మా స్ఫూర్తినే కదా అని వ్యాఖ్యానించి డిఫెన్స్ లో పడేశారు.
ఇలాంటి సంవాదనల విషయంలో కేటీఆర్ వెనక్కి తగ్గరు కదా? ఈ ఎపిసోడ్ లోనూ ఆయన తనదైన తీరును ప్రదర్శించారు. మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు విచారిస్తున్నా. గుజరాత్ కంటే 12 ఏళ్లకు ముందు 1998లో కేసీఆర్ సిద్ధిపేటలో చేపట్టిన సమగ్ర తాగునీటి ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకొని మిషన్ భగీరత రూపొందించినట్లు పేర్కొన్నారు. అంతే తప్ప గుజరాత్ వాటర్ గ్రిడ్ చూసి కాదన్నారు. కేటీఆర్ మాటల్నే ప్రాతిపదికగా తీసుకుంటే.. కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ఎమ్మెల్యేగా. దానికి అనుమతి ఇచ్చింది అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా నేతలు ఎవరు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సదరు ముఖ్యమంత్రి హయాంలో జరిగిన కార్యక్రమంగా చేపడతారే తప్పించి.. ఫలానా ఎమ్మెల్యే ప్రోగ్రాంగా చెప్పరు. అలాంటప్పుడు 1998లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలోనే కేసీఆర్ కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్ తాజా ట్వీట్ లెక్క ప్రకారం.. తెలంగాణలో ఇవాల్టి మిషన్ భగీరధ ప్రాజెక్టుకు మూలం చంద్రబాబు హయాంలో చేపట్టిన ప్రాజెక్టుగా స్పష్టం చేసినట్లే. అరే.. కమల నాథులకు కౌంటర్ ఇవ్వబోయి కేటీఆర్ భలేగా నాటి నిజాన్ని వెల్లడించారని చెప్పక తప్పదు.