Begin typing your search above and press return to search.

కేటీఆర్ డబుల్ బెడ్రూం రివ్యూ వెనుక అన్ని లెక్కలున్నాయా?

By:  Tupaki Desk   |   21 May 2020 2:30 PM GMT
కేటీఆర్ డబుల్ బెడ్రూం రివ్యూ వెనుక అన్ని లెక్కలున్నాయా?
X
ఓవైపు మందులేని మహమ్మారి దెబ్బకు ప్రపంచమంతా పరేషాన్ లో ఉన్న వేళ.. గంటల కొద్దీ ప్రభుత్వ ప్లాగ్ షిప్ పథకం మీద రివ్యూ చేయటం మామూలు విషయం కాదు. ఓవైపు.. లాక్ డౌన్ నిబంధనల్నిసడలించిన వేళ.. ఎన్నో సమస్యలు తెర మీదకు వస్తున్న వేళ.. వాటి మీద ఫోకస్ పెట్టాల్సింది పోయి.. సమీక్షలు నిర్వహించటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఏ పని చేసినా దాని వెనుక ఏదో ఒక లెక్క ఉంటుందన్న తండ్రి కేసీఆర్ ను పక్కాగా ఫాలో అవుతున్నారు మంత్రి కేటీఆర్.

మరో ఆర్నెల్ల వ్యవధిలో గ్రేటర్ హైదరాబాద్ కు ఎన్నికలు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత కీలకమైన ఈ ఎన్నికల్లో గతంలో మాదిరి రికార్డు స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లే పక్కా ప్లాన్ ను సిద్ధం చేశారు. వాస్తవానికి మాయదారిరోగం కనుక వ్యాపించి ఉండకపోతే.. ఇప్పటికే ఆ ప్లాన్ అమల్లోకి వచ్చి ఉండేది.

అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నుంచి ఇప్పుడిప్పుడే తెప్పరిల్లుతున్న మహానగరానికి ఇప్పటికి ముప్పు పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో హైదరాబాద్ లోనేూ అత్యధిక కేసులు నమోదు కావటాన్ని మర్చిపోకూడదు. ఇదిలా ఉన్నవేళలోనే.. ప్రభుత్వసంక్షేమ పథకాల్లో కీలకమైన డబుల్ బెడ్రూం ఇళ్లు సిటీలో ఎన్ని కట్టారు? రానున్నరోజుల్లో మరెన్ని పూర్తి చేయనున్నారు. మొదట్లో అనుకున్నట్లుగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లలో వీలైనంత ఎక్కువగా లబ్ధిదారులకు అందేలా ప్లాన్ చేశారు.

ఈ కార్యక్రమం భారీ ఎత్తున సాగితే ప్రభుత్వానికి వచ్చే మైలేజీ అంతా ఇంతా కాదు. లక్ష కుటుంబాలు హ్యాపీగా ఉంచామన్న ప్రచారంతో పాటు.. ప్రభుత్వానికి మంచిపేరు తీసుకొస్తుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వంగా తేలుతుందన్న వాదన వినిపిస్తోంది. డబుల్ బెడ్రూం ఇళ్లపై తానిప్పుడు రివ్యూ చేయటం ద్వారా ఈ అంశానికి భారీ ప్రాధాన్యతను ఇస్తున్నామన్న సంకేతాల్ని ఇచ్చినట్లు అవుతుంది.
మరికొద్ది నెలల్లో సిటీలో జరిగే ఎన్నికల్లో అధికారపార్టీ మైలేజీ సొంతం చేసుకునే వ్యూహంలోనే భాగమే తాజా రివ్యూ అని చెబుతున్నారు. అదే సమయంలో.. నగరంలో అందుతున్న సాయం.. వివిధ డెవలప్ మెంట్ కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించే అవకాశం లేకుండా పని చేస్తున్నారు. వ్యూహాత్మకంగా సాగుతున్న పనులకు తగ్గ ఫలితాలు భవిష్యత్తులో ఉంటాయని చెబుతున్నారు. అందుకే కదా? ఇలాంటి రిస్కీ సమయాల్లోనూ క్షణం తీరిక లేకుండా పని చేస్తున్న దాని వెనుక మర్మం లేకుండా ఉంటుందా చెప్పండి?