Begin typing your search above and press return to search.
కొలంబోలో చెలరేగిపోతున్న కేటీఆర్
By: Tupaki Desk | 12 Aug 2016 10:25 AM ISTఇటీవల కాలంలో తరచూ విదేశీ పర్యటనలు చేస్తూ పలువురు ప్రముఖుల్నికలుస్తూ దూసుకెళుతున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు.. కమ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త పారిశ్రామిక పాలసీతో పాటు.. తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి ప్రచారం చేయటం.. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను బిల్డ్ చేయటం కోసం ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు.
తాజాగా శ్రీలంక రాజధాని కొలంబోలో పర్యటిస్తున్న కేటీఆర్.. పలువురు ప్రముఖులతో భేటీ అవుతున్నారు. హైదరాబాద్ నుంచి కొలంబోకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా చూడాలన్న విన్నపంతో పాటు.. పలువురు పారిశ్రామికవేత్తల్ని కలిసిన కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. ఓ పక్క పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతూనే.. మరోవైపు ప్రభుత్వంతో కీలకమైన అంశాలపై చర్చలు జరుపుతూ.. రాష్ట్రాభివృద్ధికి ఎంతమేర సాయం కావాలన్న విషయాన్ని వారి ముందు పెట్టటం కనిపిస్తుంది.
శ్రీలంకలోని భారత హైకమిషన్ వైకే సిన్హతో భేటీ కావటం మొదలు.. తెలంగాణలో శ్రీలంక పెట్టుబడులు పెట్టేందుకు భారత కమిషనర్ హామీ ఇవ్వటం గమనార్హం. తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్స్ రంగంలో పెట్టుబడుల అంశంపై జాన్ కీల్స్ కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన కేటీఆర్.. సదరు సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించటం గమనార్హం. అదే సమయంలో మలేషియాలోని పేర్ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు వ్యాపార ఒప్పందాలకు సంబంధించిన చర్చల్ని పూర్తి చేశారు. ఒకదాని తర్వాత ఒక దేశానికి వెళుతూ కేటీఆర్ దూసుకెళుతున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మాట కోసమే కదా కేటీఆర్ అంతలా కిందామీదా పడిపోతున్నది.