Begin typing your search above and press return to search.

రాహుల్‌ ను చూసి ఓటు కూడా వేయరు

By:  Tupaki Desk   |   29 Sept 2018 12:09 AM IST
రాహుల్‌ ను చూసి ఓటు కూడా వేయరు
X
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల దూకుడు పెరుగుతోంది. అప‌ద్ధ‌ర్మ ప్ర‌భుత్వానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న టీఆర్ ఎస్ పార్టీ విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతోంది. తాజాగా మంత్రి కేటీఆర్ తెలంగాణ‌లో త‌మకు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా భావిస్తున్న పార్టీల‌పై మండిప‌డ్డారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజేందర్‌ రెడ్డి - అనుచరులు టీఆర్ ఎస్‌ లో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు చెప్పుకోవడానికి బీజేపీ నేతలకు ఒక్క మంచి పథకం కూడా లేదన్నారు. 2014తో పోలిస్తే ఇప్పుడు బీజేపీ - మోడీ ప్రతిష్ట మసకబారిందని - మోడీ ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటం తప్ప..ఎలాంటి ప్రయోజనం లేదని విమర్శించారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోతోంద‌ని కేటీఆర్ విశ్లేషించారు. నోట్ల రద్దు వల్ల ఎలాంటి మేలు జరగలేదని ప్రజలకు అర్థమైందని, దేశంలోని పేదల కోసం ఎన్టీఏ సర్కార్ చేసిందేమీ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. స్వచ్ఛ భారత్ ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ..లక్ష్యం మాత్రం నెరవేరటం లేదన్నారు. రాష్ర్టానికి ద‌క్కాల్సిన ప్ర‌యోజ‌నాల గురించి ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ప్ర‌స్తావిఒంచారు. `ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం మూలన పెట్టింది. ఐటీఐఆర్‌ పై కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ తో ఎన్నిసార్లు మాట్లాడినా లాభం లేకుండా పోయింది. ఇంతవరకు పన్ను రాయితీలు ఇవ్వలేదు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రం నెరవేర్చలేదు. మొదటి 9 నెలలు ప్రధాని మోడీ ఒక్క ఫైల్‌మీద సంతకం పెట్టలేదు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం ఢిల్లీ చుట్టూ తిరిగినం. తెలంగాణకు రూ.23 లక్షల కోట్లు ఇచ్చామని అమిత్‌షా అంటున్నారు. పన్నుల రూపంలో మనం ఇస్తేనే కేంద్రం మనకు నిధులు ఇస్తుంది. రాష్ర్టాలు పన్నులు కట్టకుంటే కేంద్రం ఎక్కడుంటుంది? అని ప్రశ్నించారు.

కేసీఆర్ నేతృత్వంలో ప్రజలు చేసిన ఉద్యమం కాంగ్రెస్ అధిష్టానం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే వీపు చింతపండు అవుతదని కాంగ్రెస్ విభజించిందని కేటీఆర్ ఎద్దేశా చేశారు. రాహుల్‌ను చూసి ఓటు వేసేవారు కూడా వేయరని, ఆయ‌న గురించి తెంగలంగాణ కాంగ్రెస్ ఆశ‌లు పెట్టుకుంటుంద‌న్నారు.