Begin typing your search above and press return to search.
మోడీ ఇలాకాలో కేటీఆర్ సందడి
By: Tupaki Desk | 1 July 2017 11:34 PM ISTప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనితీరును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు - మంత్రి కేటీఆర్ ప్రశంసిస్తున్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ సబర్మతి నది రివర్‌ఫ్రంట్‌ను సందర్శించారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సబర్మతి నది ప్రక్షాళను శ్రీకారం చుట్టారు. కలుషితమయిపోయిన నదిని సుందరీకరించి దానికి పునర్‌వైభవం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లో టెక్స్ టైల్ సమ్మిట్ కు హాజరైన మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని సబర్మతి రివర్ ఫ్రంట్ ను సందర్శించారు. మూసీ అభివృద్ది - సుందరీకణ పైన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్న నేపథ్యంలో సబర్మతి నది అభివృద్ది నమూనాను అధ్యయనం చేశారు. ఇందుకోసం రివర్ ప్రంట్ అధికారులు మంత్రి బృందానికి వివరాలు అందజేశారు. సుందరీకణ కోసం ఏదురైన సమస్యలు - నదీ ఒడ్డున అప్పటి దాకా ఉన్న జనావాసాలు తరలింపు, మెత్తం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు పట్టిన సమయం వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ విజన్ - ప్రజల సహాకారంతోనే ఈ ప్రాజెక్టు విజయం సాధించిందని తెలిపారు.
సుందరీకరణ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ రివర్ ప్రంట్ అహ్మదాబాద్ పట్టణానానికి ఒక తలమానీకంగా నిలిచిందని, ఇదే స్థాయిలో మూసినదిని అభివృద్ది చేస్తామని, ఈ దిశగా ఇప్పటికే నిధుల సమీకరణ, తొలి దశ ప్రణాళికలు సిద్దం అవుతున్నాయని మంత్రి తెలిపారు. సబర్మతి నది ఒడ్డున ఏర్పాటు చేసిన గార్డెన్స్, వాక్స్ వేలు, పార్కులు, రోడ్లను మంత్రి సందర్శించారు. ఈ సందర్శన అనుభవం ఖచ్చితంగా మూసి నదీ సుందరీకరణకు ఉపయోగపడుతుందన్నారు.
కాగా అంతకుముందు సబర్మతి ఆశ్రమాన్ని మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న మ్యూజియంను సందర్శించిన మంత్రి.. గాంధీజీ చరఖా వద్ద ఫోటో దిగారు. అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు మంత్రి. ఈ సందర్భంగా కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. సబర్మతి ఆశ్రమం సందర్శించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. గాంధీ సాధారణ వ్యక్తి అని పేర్కొన్న మంత్రి.. ఆయన గొప్ప జీవితాన్ని గడిపారని ట్వీట్ చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/