Begin typing your search above and press return to search.

కిష‌న్ రెడ్డి గాలి తీసేసిన కేటీఆర్‌

By:  Tupaki Desk   |   8 Feb 2022 9:00 AM IST
కిష‌న్ రెడ్డి గాలి తీసేసిన కేటీఆర్‌
X
బీజేపీ సార‌థ్యంలోని కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నం చేకూర్చ‌డం లేద‌ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ విరుచుకుప‌డుతున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొదలుకొని ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు, పార్టీ నేత‌లు బీజేపీని ఇర‌కాటంలో ప‌డేసేలా టార్గెట్ చేస్తున్నారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామ‌చంద్ర‌రావు సైతం త‌మ‌దైన శైలిలో టీఆర్ఎస్ నేత‌ల‌కు కౌంట‌ర్లు ఇచ్చారు. అయితే, తాజాగా కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి చేసిన ట్వీట్ల‌కు కేటీఆర్ ఘాటు రిప్ల‌యి ఇచ్చారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ తెలంగాణ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా EqualityForTelangana అనే హ్యాష్‌ట్యాగ్‌తో తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయం ఇది అంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రిపై కేటీఆర్ మండిప‌డ్డారు. దీనికి కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ పోలీసులు ప‌క్క‌కు త‌ప్పుకొంటే దేశంలోని హిందువుల అంతు చూస్తామ‌ని గ‌తంలో ఓవైసీ చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను టీఆర్ఎస్ నేత‌లు స‌మ‌ర్థిస్తున్నార‌ని ట్వీట్ చేశారు. దీనికి స్పంద‌న‌గా తెలంగాణ బీజేపీ నేత‌కు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ‌కు చేస్తున్న అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తున్నామ‌ని పేర్కొంటూ కిష‌న్ రెడ్డిపై ప‌రోక్షంగా సెటైర్లు వేశారు.

EqualityForTelangana అనే హ్యాష్‌ట్యాగ్‌తో తెలంగాణ‌ను ఎన్ని విష‌యాల్లో కేంద్రం మోసం చేసిందో చూడండి అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్... తెలంగాణ‌ రాష్ట్రం పట్ల‌ కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు, రాష్ట్రంపై కేంద్ర చూపిస్తున్న వివ‌క్ష గురించి నేను ప్ర‌శ్నిస్తే.. మీరు మాత్రం అసంబ‌ద్ధ అంశాల‌ను తెర‌మీదికి తెస్తున్నారంటూ కేంద్ర మంత్రిపై సెటైర్ వేశారు. రాష్ట్ర ప్రాజెక్టుల‌కు కేంద్ర చేసిన అన్యాయంపై కిష‌న్ రెడ్డి ఎందుకు వివ‌ర‌ణ ఇవ్వ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు.