Begin typing your search above and press return to search.
సీఎం పోస్టు.. తిరుమల టూరు.. గుట్టువిప్పిన కేటీఆర్
By: Tupaki Desk | 19 Jan 2020 6:44 PM ISTతెలంగాణ సీఎం కేసీఆర్ లో భక్తిభావం ఎక్కువ. ఆయన స్వతహాగానే తరుచుగా ఆలయాలు సందర్శిస్తూ మొక్కులు చెల్లించుకుంటూ పూజలు, పునస్కారాలు, యాగాలు, హోమాలు చేస్తుంటారు. కానీ కేసీఆర్ తోపాటు కేటీఆర్ ఎప్పుడూ కనిపించరు. కేసీఆర్ ను అనుసరించరు.
మంత్రి కేటీఆర్ ఎప్పుడూ నాస్తికుడిని అని చెప్పుకోనప్పటికీ ఏ మతపరమైన కార్యక్రమం వేడుకల్లో పాల్గొనకుండా ఆచారాలు పాటించకుండా దూరంగా ఉంటారు. కేసీఆర్ ఎల్లప్పుడూ దేవాలయాల సందర్శనతో కాలం గడుపుతుండగా.. కేటీఆర్ మాత్రం గత 10 సంవత్సరాలుగా దేవాలయాలను సందర్శించలేదు.
అయితే తాజాగా కేటీఆర్ లోనూ మార్పు వచ్చింది. పూర్తిగా భక్తిభావంలోకి కేటీఆర్ మారిపోయాడు. గతానికి భిన్నంగా వ్యవహరిస్తున్నాడన్న చర్చ సాగుతోంది. గత నెలలో కేసీఆర్ తోపాటు సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని కేటీఆర్ దర్శించుకున్నారు. సోమవారం వైకుంఠ ఏకదాశికి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు.
అయితే కేటీఆర్ ఇలా మారిపోయి దేవాలయాల బాటపట్టడానికి ప్రధాన కారణం త్వరలో సీఎం కాబోతున్నారని.. అందుకే కేసీఆర్ సలహా మేరకు రిస్క్ తీసుకోవద్దనే ఎలాంటి అవకాశాలను జారవిడుచుకోవద్దని కేటీఆర్ ఇలా ఆధ్మాత్మిక బాట పట్టినట్టు ప్రచారం జరిగింది.
అయితే దీనిపై తాజాగా ఓ విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఇదే ప్రశ్న ఎదుర్కొన్నారు. ‘తాను సీఎం కాబోతున్నాననే ప్రచారం మీడియా సృష్టియేనన్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకపోవడంతో మసాలా న్యూస్ కోసం తనను సీఎం చేస్తున్నారని’ కేటీఆర్ ఆక్షేపించారు. అయితే నాస్తికుడైన తాను తిరుమలకు వెళ్లడానికి కారణం చెప్పారు కేటీఆర్. ‘నాకు కుటుంబం ఉందని.. భార్యా పిల్లల నుంచి ఒత్తిడి ఉందని.. ఒక్కోసారి వారి మాట వినాలి కదా.. దానికి సీఎం కావడానికి ఎలాంటి సంబంధం లేదు’ అని తిరుమల పర్యటనపై క్లారిటీ ఇచ్చారు.