Begin typing your search above and press return to search.
తండ్రి సభను కేటీఆర్ లైట్ తీస్కున్నారా?
By: Tupaki Desk | 25 Aug 2016 11:06 AM ISTమహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం చేసుకున్న అనంతరం తిరిగివచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభను ఆయన తనయుడు- రాష్ట్ర మంత్రి కేటీఆర్ లైట్ తీసుకున్నారా?హైదరాబాద్ లోని బేగంపేట గ్రాండ్ వెల్ కమ్ నిర్వహించాలని ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించినప్పటికీ నగరంలో జరిగిన ఈ పార్టీ కార్యక్రమాన్ని గ్రేటర్ శ్రేణులు పూర్తి స్థాయిలో ఎందుకు హాజరుకాలేదు? మంత్రి హరీశ్ రావుకు మైలేజీ దక్కుతుందనే ఉద్దేశంతోనే కేటీఆర్ సైడ్ అయ్యారా? ఈ క్రమంలో హరీశ్ జోక్యం చేసుకొని తన టీంను రంగంలోకి దించారా? కేసీఆర్ ర్యాలీని చూసిన అనంతరం రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ ఇది.
మహా ఒప్పందం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు భారీ స్వాగతం పలకడంతో పాటు హైదరాబాద్ లో సభ నిర్వహించాలని టీఆర్ ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసింది. మంత్రులు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - నగర కార్పొరేటర్లతోనూ సమావేశం నిర్వహించారు. కేసీఆర్ ను ఊరేగింపుగా బేగంపేట విమానాశ్రయం నుండి క్యాంపు కార్యాలయానికి తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఆ స్థాయిలో జన సమీకరణ లేదు. జన సమీకరణకు నగర టీఆర్ ఎస్ కార్పొరేటర్లు ఆసక్తి చూపించలేదని అంటున్నారు. సిటీ బాధ్యతలు చూస్తున్న మంత్రి కేటీఆర్ కూడా జన సమీకరణలో జోక్యం లేకపోవడాన్ని పలువురు నేతలు ప్రస్తావిస్తున్నారు. జన సమీకరణ తక్కువగా ఉండటం కేసీఆర్ ను కూడా అసహనానికి గురిచేసి ఉండొచ్చని తెలుస్తోంది. జనం బాగా వస్తారన్న ఉద్దేశంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. నాలుగున్నరకు జరగాల్సిన సభ ఐదున్నర తర్వాత సీఎం మాట్లాడారు. ఏర్పాటు చేసిన వేదిక నుండి గాకుండా ఓపెన్ టాప్ బస్సు నుండే కేసీఆర్ మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి నగరం నుండి జనం రావడం లేదని అంచనా వేసిన మంత్రి హరీశ్ రావు మెదక్ జిల్లా నుండి ఎక్కువమంది టీఆర్ ఎస్ కార్యకర్తలను రప్పించినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. చివర్లో హరీశ్ రావు జోక్యం చేసుకోకుంటే గ్రాండ్ వెల్ కమ్ కాస్త అట్టర్ ప్లాప్ అయి ఉండేదని టీఆర్ ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జనం లేరన్న విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పందం విషయాల కంటే విమర్శలకే ప్రాధాన్యత ఇచ్చారని తెలుస్తోంది. అందుకే రాజకీయ విమర్శల ద్వారా కేసీఆర్ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.