Begin typing your search above and press return to search.

బాబు హామీల‌న్నీ!... డ్రామాలేన‌ట‌!

By:  Tupaki Desk   |   23 Jan 2019 10:00 PM IST
బాబు హామీల‌న్నీ!... డ్రామాలేన‌ట‌!
X
ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌ బాబు నాయుడు సంక్షేమ పాల‌న‌కు తానే కేరాఫ్ అడ్రెస్ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాను ప్ర‌క‌టించే ప‌థ‌కాలు... గ‌తంలో ఏ ఒక్క‌రూ చేప‌ట్ట‌లేద‌ని - అస‌లు ఈ త‌ర‌హా ఆలోచ‌న‌లు ఏ నేత‌కైనా వ‌చ్చాయా? అంటూ డాంబికాలు ప‌లుకుతున్న చంద్ర‌బాబు... త‌న ప‌థ‌కాల‌న్నీ కూడా ఇత‌ర రాష్ట్రాల ప్ర‌భుత్వాలు - త‌న ముందు ఏపీని పాలించిన ఏ నేత కూడా చేప‌ట్ట‌నివేన‌న్న క‌ల‌రింగ్ కూడా ఇచ్చేస్తున్నారు. బాబు నోట నుంచి వినిపించే ఈ చిలుక ప‌లుకుల‌ను ఆయ‌న అనుకూల మీడియా తాటికాయంత అక్ష‌రాల‌తో త‌మ ఫ‌స్ట్ పేజీల‌ను నింపేస్తున్నాయి. ఈ వైనంపై ఇత‌ర రాజ‌కీయ పార్టీలు - ప్ర‌జా సంఘాలు గ‌గ్గోలు పెడుతున్నా కూడా ఇటు బాబు గానీ - ఆయ‌న అనుకూల మీడియా ఏమాత్రం ప‌ట్టించుకున్న పాపాన పోవ‌డం లేదు. పైపెచ్చు త‌మ సంక్షేమ పాల‌న‌కు అడ్డంకులు సృష్టించడ‌మే విఫ‌క్షాల ప‌ని అంటూ తిరిగి నిందారోప‌ణ‌లు చేస్తున్నాయి. ఈ త‌ర‌హా బాబు పాల‌న‌ - మీడియా ద్వంద్వ వైఖ‌రిపై టీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు త‌న‌దైన శైలిలో ఘాటు రిప్లై ఇచ్చారు.

సంక్షేమం పేరిట చంద్ర‌బాబు ఇప్పుడు ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాల‌న్నీ ఎన్నిక‌ల స్టంటేన‌ని - అచ్చంగా చెప్పాలంటే చంద్ర‌బాబు డ్రామాలు ఆడుతున్నార‌ని ఆయ‌న తేల్చేశారు. ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ క్రాంతి కుమార్‌ కు టీఆర్ ఎస్ టికెట్ ఇచ్చిన కేసీఆర్... ఆయ‌న‌ను గెలిపించుకున్నారు కూడా. ఈ సంద‌ర్భంగా క్రాంతి కుమార్‌ కు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు స‌న్మాన స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు హాజ‌రైన సంద‌ర్భంగా కేటీఆర్‌... చంద్ర‌బాబుతో పాటు ఎల్లో మీడియాపైనా త‌న‌దైన శైలి సెటైర్లు సంధించారు. ఎన్నిక‌ల్లో ఓట్ల‌ను కొల్ల‌గొట్టేందుకే చంద్ర‌బాబు పెద్ద ఎత్తున ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్నార‌ని - ఈ ప‌థ‌కాల వెనుక చంద్ర‌బాబు అస‌లు వ్యూహాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో ఏపీ ప్ర‌జ‌లు లేర‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయినా చంద్ర‌బాబు ప్ర‌క‌టిస్తున్న ప‌థ‌కాల‌న్నీ కూడా ఇదివ‌ర‌కు తాము అమ‌లు చేసిన‌వేన‌ని - త‌మ ప‌థ‌కాల‌నే చంద్ర‌బాబు కాపీ కొడుతున్నార‌ని కూడా ఆరోపించారు. మొత్తంగా చంద్ర‌బాబు ఇప్పుడు కాపీ - పేస్ట్ సీఎంగా మారిపోయార‌ని... బాబు చేస్తున్న‌దంతా కూడా డ్రామానేన‌ని కూడా ఎద్దేవా చేశారు. ఆటోలు - ట్రాక్ట‌ర్ల‌కు లైఫ్ ట్యాక్స్ ఎత్తివేత తెలంగాణ‌లో ఎప్పుడో జ‌రిగిపోయింద‌ని - దీనిని దేశంలో తానొక్క‌డినే చేస్తున్నానంటూ చంద్ర‌బాబు బిల్డ‌ప్ కొడుతున్నార‌న్నారు.

ఏపీలో మ‌రోమారు అధికారం చేజిక్కించుకునేందుకు ర‌చించుకున్న వ్యూహం బోల్తా కొట్ట‌డం ఖాయ‌మ‌ని కూడా కేటీఆర్ జోస్యం చెప్పారు. చంద్ర‌బాబు కుట్ర‌ల‌ను అర్థం చేసుకోలేని స్థితిలో ఏపీ ప్ర‌జ‌లు లేర‌ని - తెలివైన నిర్ణ‌యం తీసుకునే ఏపీ ఓట‌ర్లు చంద్ర‌బాబును ఇంటికి సాగ‌నంప‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబుకు టైం ద‌గ్గ‌ర‌ప‌డింద‌ని కూడా కేటీఆర్ చెప్పారు. ఆ త‌ర్వాత ఎల్లో మీడియాపై త‌న దృష్టిని సారించిన కేటీఆర్‌... కొన్ని ప‌త్రిక‌లు - మీడియా సంస్థ‌లు ద్వంద్వ ప్ర‌మాణాల‌తో ప‌నిచేస్తున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఏపీ వార్త‌లంటే త‌మ‌కు ఇష్ట‌మేన‌ని - అయితే ఏపీలో కూడా తెలంగాణ వార్త‌ల‌ను చూపాల్సిందే - రాయాల్సిందే క‌దా అని కూడా కేటీఆర్ లాజిక్ తీశారు. ఈ త‌ర‌హా వైఖ‌రిని కొన్ని మీడియా సంస్థ‌లు మాత్ర‌మే పాటిస్తున్నాయ‌ని ఆరోపించిన కేటీఆర్‌... ఆ ప‌త్రిక‌లు ఇప్ప‌టికైనా త‌మ తీరు మార్చుకోని పక్షంలో త‌గిన రీతిలో బుద్ధి చెప్ప‌డం గ్యారెంటీ అని వార్నింగ్ ఇచ్చారు. మొత్తంగా సింగిల్ స్పీచ్ లోనే కేటీఆర్‌... చంద్ర‌బాబు - ఎల్లో మీడియాకు జాయింట్ గా వార్నింగిచ్చేశార‌న్న మాట‌.