Begin typing your search above and press return to search.
కేటీఆర్ డ్రెస్సే మారింది..దుస్థితి సేమ్ టు సేమ్
By: Tupaki Desk | 23 Sept 2016 1:33 PM ISTనమ్మరు కానీ నిజమిది. ఏదో విమర్శించాలని విమర్శించటం లేదు. సాక్ష్యాలు చూపించి మరీ అన్న మాట నిజమని నిరూపిస్తాం. కావాలంటే చూడండి. పేరుకు తెలంగాణ రాష్ట్ర మంత్రి అయినప్పటికీ.. అప్రకటిత సీఎంగా అందరూ ఫీలయ్యే కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం ఉండటం లేదన్న మాట రోజురోజుకీ పెరుగుతోంది గతంలో ఆయన ఏదైనా అంశం మీద ఫోకస్ చేశారంటే.. పని పరుగులు పెడుతుందని ఫీలయ్యే వారు. ఎందుకంటే.. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కుమారుడే మంత్రి అయితే అధికారులు ఎంతగా పని చేస్తారో అని ఫీలయ్యే వారు. కానీ.. తాజాగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తే.. విషయం మొత్తం అర్థమయ్యే పరిస్థితి.
తాజాగా అతి భారీగా కురిసిన వర్షాలతో భాగ్యనగరం అభాగ్యనగరంగా మారిపోయింది. అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా సిటీ మొత్తం నీటితో నిండిపోయిన పరిస్థితి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావటం.. రోడ్లు మొత్తం ఛిద్రమైపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. హైదరాబాద్ మహా నగరం హైదరాబ్యాడ్ గా మారిపోయింది. గడిచిన నాలుగు రోజులుగా జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి.
గతంలో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు బాధితులుగా కనిపించేవారు. ఈసారి అతి భారీ వర్షాల పుణ్యమా అని.. పాతిక లక్షలు.. నలబై లక్షలు పోసి కొనుక్కున్న బిల్డింగులు వందలాదిగా వాన నీటిలో మునిగిపోతున్న దుస్థితి. లక్షలాది మంది ప్రభావితమైన నేపథ్యంలో.. సీరియస్ నెస్ ను గుర్తించిన మంత్రి కేటీఆర్ నగరాన్ని చుట్టు వస్తున్నారు. పలు ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సాయం చేస్తామని చెప్పి వస్తున్నారు. స్వయంగా కేటీఆర్ వచ్చి మాట ఇచ్చిన తర్వాత కూడా పనుల్లో చురుకుదనం ఉండటం లేదన్నది ఇప్పుడు విమర్శగా మారింది.
కొద్ది వారాల క్రితం రోడ్లు దారుణంగా దెబ్బ తిన్న వేళ.. ఇప్పటి మాదిరే కేటీఆర్ హడావుడి చేశారు. ఆకస్మిక తనిఖీలు.. అర్థరాత్రిళ్లు విజిట్స్ అంటూ అధికారుల్ని వెంటేసుకొని ఏదో జరుగతున్న ఫీలింగ్ వచ్చేలా చేశారు. కానీ.. అదంతా ఉత్త భ్రమ అన్న విషయం కొన్ని రోజులకే అర్థమైంది. అప్పుడంటే రోడ్లను బాగు చేయటం వెంటనే సాధ్యం కాదని సర్దిచెప్పుకోవచ్చు. కానీ.. ఇప్పుడు ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. అయినప్పటికీ యంత్రాంగం భారీగా రంగంలోకి దిగినట్లుగా కనిపించని పరిస్థితి. నీళ్లుభారీగా చేరుకున్న అపార్ట్ మెంట్లలో రోజుల తరబడి నీళ్లను బయటకు వదులుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటి (గురువారం) విషయాన్నే తీసుకుంటే.. పొద్దున్నే టీ షర్ట్ వేసుకొని అధికారులతో హడావుడి చేసిన కేటీఆర్.. అర్థరాత్రి వేళ ఫుల్ హ్యాండ్స్ చెక్స్ షర్ట్ వేసుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆయన వేసుకున్న చొక్కాలు మారుతున్నా.. పరిస్థితిలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదన్న విమర్శ వినిపిస్తోంది. ఇప్పుడు చెప్పండి.. మంత్రి హోదాలో ఉన్న ముఖ్యమంత్రి కుమారుడు స్వయంగా రంగంలోకి దిగినా ప్రజల కడగండ్లు తీరకపోవటాన్ని ఏమనాలి? ఎవరిని నిందించాలి?