Begin typing your search above and press return to search.
కేటీఆర్, ఆదిత్య మిట్టల్.. ఇద్దరూ యువ తేజాలు కలిసినవేళ
By: Tupaki Desk | 31 March 2022 11:00 PM ISTఒకప్పుడు స్టీల్ సామ్రాజ్యాన్ని ఏలిన వ్యాపార దిగ్గజం ‘లక్ష్మీ మిట్టల్’. విశ్వవిఖ్యాతి పొందిన ఆర్సెలర్ మిట్టల్ కంపెనీకి ఆయన వారసుడు ఆదిత్య మిట్టల్ సీఈవోగా నియమితులయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. మిట్టల్ స్టీల్ వ్యవస్థాపకుడు అయిన లక్ష్మీ మిట్టల్ కుమారుడైన ఆదిత్య ఇటీవలే ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ సీఈవోగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్ వచ్చిన ఆదిత్య మిట్టల్ తో మంత్రి కేటీఆర్ భేటి అయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ‘హైదరాబాద్ అల్లుడు’ కూడా అయిన ఆదిత్య మిట్టల్ తో భేటి అయ్యానని.. తెలంగాణలో ఆర్సెలర్ మిట్టల్ కంపెనీ పెట్టుబడులపై చర్చించామని కేటీఆర్ తెలిపారు.
బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని.. రాష్ట్రప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు, ప్రోత్సాహకాలు అందిస్తుందని మిట్టల్ కు కేటీఆర్ హామీ ఇచ్చారు. కర్మాగారం ఏర్పాటుకు బయ్యారం అత్యంత అనుకూలమైందని.. విస్తృతమైన ఇనుప ఖనిజ నిల్వలలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా పరిశ్రమకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు.
ఉపాధి కల్పనతోపాటు వనరుల సద్వినియోగం, ఉక్కు ఉత్పత్తి, ఎగుమతుల లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు కర్మాగార ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ఏపీ విభజన చట్టంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం.. మాట నిలబెట్టుకోలేదన్నారు. ప్రైవేటు రంగంలో పరిశ్రమను స్థాపించేందుకు మిట్టల్ సంస్థ ముందుకు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
భూ కేటాయింపులకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలులో ఉందని.. మెగా పరిశ్రమ హోదా కింద ఎక్కడా లేని విధంగా రాయితీలు ఇస్తామని కేటీఆర్ తెలిపారు.
ఇక బయ్యారం జాతీయ రహదారికి సమీపంలో ఉంది. వరంగల్ జిల్లాలోని మామునూరు వద్ద విమానాశ్రయాన్ని పునరుద్దరించే సన్నాహాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉంది. కొత్తగూడెం వద్ద కొత్త విమానాశ్రయ ప్రతిపాదన చేశామన్నారు.
హైదరాబాద్ అల్లుడైన ఆదిత్య మిట్టల్ ఇటీవలే తండ్రి లక్ష్మీ మిట్టల్ ను వారసత్వంగా ఆర్సెలర్ స్టీల్ కంపెనీ పగ్గాలు చేపట్టారు. హైదరాబాద్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు మేలు చేసేందుకు చొరవ చూపాలని కేటీఆర్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. తెలంగాణకు త్వరలోనే తమ బృందాన్ని పంపుతామని తెలిపారు.