Begin typing your search above and press return to search.
కేటీఆర్ లీక్స్.. కేసీఆర్ మదిలో గొప్ప పథకం
By: Tupaki Desk | 14 Aug 2019 12:10 PM ISTతెలంగాణలో కేసీఆర్ మరో భారీ పథకానికి నాంది పలుకబోతున్నారా? దేశం గర్వించే ఆ పథకం అమలు చేస్తే కేసీఆర్ కు తిరుగుండదా.? దేశాన్ని షేక్ చేసే ఆ పథకం కనుక అమలైతే తెలంగాణలో కేసీఆర్ కు పోటీ అంటూ ఉండదనే అభిప్రాయలు వెలువడుతున్నాయి..
తాజాగా టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సొంత నియోజకవర్గం సిరిసిల్లలో 5 కోట్ల నిధులతో నిర్మించే ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే కేసీఆర్ ఆరోగ్య తెలంగాణను ఆవిష్కరించబోతున్నారని.. ఈ మేరకు ఆయన మదిలో ఓ గొప్ప పథకం రూపుదిద్దుకోబోతోందని చూచాయగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ విషయంలో గ్రౌండ్ వర్క్ పూర్తయ్యిందని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆరోగ్యసమాచారాన్ని కొద్దిరోజులుగా ఏఎన్ ఎంలు, ఆరోగ్య కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా సేకరించి ఆన్ లైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి గ్రామాలు, పట్టణాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి వారి రోగాలను నిగ్గుతేల్చి మందులు, చికిత్సలు అందించారు.
ఇప్పుడు ఆ డేటాను మొత్తం క్రోడీకరించి వెబ్ సైట్ లో పెట్టి తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు యాక్సెస్ ఇస్తారట.. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ పౌరుడికి ఉచిత చికిత్స అందించే గొప్పపథకాన్ని కేసీఆర్ రాబోయే ఏడాదిలోగా ప్రారంభించడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
ఈ పథకం కనుక అమలైతే తెలంగాణలోని అందరికీ ఉచిత వైద్యం అందుతుంది. తెలంగాణ ప్రజల దశను మార్చే ఈ గొప్ప పథకం గురించి తాజాగా కేటీఆర్ ఇచ్చిన లీక్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.