Begin typing your search above and press return to search.
ఐటీ ఎగుమతుల్లో లక్ష కోట్ల దిశగా తెలంగాణ
By: Tupaki Desk | 1 Jun 2018 10:07 PM ISTఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతులు ఏటికేడు పెరుగుతున్నాయి. తాజాగా 2017-18లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.93,442 కోట్లను దాటేశాయి. గత ఆర్థిక సంవత్సరం కంటే ఏకంగా 9.32 వృద్ధి రేటు నమోదైంది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ.
ప్రధానంగా హైదరాబాద్ లోనే ఉన్నతెలంగాణ ఐటీ రంగం ఈ ఏడాది కొత్తగా 43,417 మందికి ఉద్యోగావకాశాలు కల్పించిందని ఐటీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు .దీంతో తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 4,75,308కి చేరినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ఐటీ - ఎలక్ట్రానిక్స్ - కమ్యూనికేషన్ల శాఖ వార్షిక నివేదిక వెల్లడించారు. 2020 నాటికి లక్షా 20 వేల కోట్ల ఐటీ ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
మరోవైపు ఐటీ వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో ఆయన ప్రభుత్వ వెబ్ సైట్లు - సేవల వివరాలతో కూడిన టీ-వెబ్ ను ప్రారంభించారు. టీ-వెబ్ ద్వారా ప్రభుత్వ వెబ్ సైట్లన్నీ అనుసంధానం కానున్నాయి. దీంతోపాటు ఆధార్ ఆధారిత అటెండెన్స్ వ్యవస్థ-అబాస్ ను కూడా మంత్రి ప్రారంభించారు. పాఠాశాలల్లో ఆధార్ ఆధారిత అటెండెన్స్ ను ప్రభుత్వం అమలు చేయనుంది. 12 జిల్లాల్లోని 10 వేల పాఠశాలల్లో ఆధార్ ఆధారిత అటెండెన్స్ వ్యవస్థను తీసుకువస్తున్నారు.